స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్… ఎంత ఎనర్జిటిక్ గా ఉంటాడో, ఎంత కాన్ఫిడెంట్ గా ఉంటాడో…. అందరికీ తెలిసిందే.ఇండస్ట్రీలో అంతా ఇతన్ని చాలా గట్టోడు అంటుంటారు. ఏ విషయంలో అయినా సరే ‘తగ్గేదే లె’ అంటూ దూసుకుపోతుంటాడు. ఇతని సతీమణి స్నేహారెడ్డి కూడా ఇతనికి ఏమాత్రం తీసిపోదు. తన భర్తలానే ఈమె కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉంటుంది. ట్రెండ్ కు తగ్గట్టు బన్నీ కంటే స్టైలిష్ గా ఉంటుంది. ఒక్కోసారి ఇతని భర్త పైనే సెటైర్లు వేస్తూ హాట్ టాపిక్ అవుతుంటుంది.
గతంలో ఓసారి బన్నీ తన కూతురు అర్హకి ‘నేను చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి’ అంటూ చెబుతుంటే.. ‘నువ్వు చేసుకున్నావా.. మీ నాన్న చెప్పిన అమ్మాయిని.. నీ కూతురు ఎలా చేసుకుంటుంది’ అంటూ ఫన్నీ కామెంట్ పెట్టి హాట్ టాపిక్ అయ్యింది. బన్నీలానే స్నేహ కూడా ఫిట్నెస్ కు ప్రాధాన్యత ఎక్కువ ఇస్తుంటుంది. అందుకోసం యోగాసనాలు కూడా వేస్తుంటుంది. హీరోయిన్లకు స్నేహ ఏమాత్రం తీసిపోదు. ఈమె ఫోటోలకు ఇచ్చే ఫోజులు చూస్తే ఈ విషయాన్ని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. కావాలంటే ఓ లుక్కేయండి :