బాల అల్లూరి సీతారామరాజుగా గౌతమ్ కృష్ణ!

  • August 25, 2016 / 11:49 AM IST

సూపర్ స్టార్ కృష్ణ మనవుడు, మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ కి భారీ కథ సిద్ధమవుతోంది. వన్ నేనొక్కడినే చిత్రం తో వెండితెరపై కనిపించిన గౌతమ్ కృష్ణ .. తొలి సినిమాతోనే అభినందనలు అందుకున్నాడు. సినిమాలో కొంత సేపే కనిపించినా ఘట్టమనేని అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. ఇప్పుడు వారికి  మరో శుభవార్త. కృష్ణ సూపర్ హిట్ మూవీ అల్లూరి సీతారామరాజుని మరో సారి తెరకెక్కిస్తున్నారు. అయితే కథలో భారీ చేంజ్ ఉంటుందంట.

పోరాట యోధుడు అల్లూరి బాల్యంలో ఎదుర్కొన్న సంఘటనలు, అతనిపై ఎలా ప్రభావం చేసింది ? అనే కోణంలో కథ గమనం ఉంటుందని, బాల సీతారామ రాజుగా గౌతమ్ నటించనున్నట్లు సమాచారం. రామ్ గోపాల్ వర్మ ‘అనగనగా ఒక రోజు,’ కృష్ణవంశీ ‘గులాబి’ సినిమాలకు రచయితగా పనిచేసిన నడిమింటి నరసింగరావు ఈ కథను రాసే పనిలో బిజీగా ఉన్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. ఖడ్గం, మహాత్మా చిత్రాల్లో దేశభక్తిని అద్భుతంగా చూపించిన క్రియేటివ్ డైరక్టర్ కృష్ణ వంశీ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది. చరిత్ర సృష్టించే మరో చిత్ర రూపకల్పనకు బీజం పడిందన్నమాట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus