అఖిల్ ఒక “శాడిస్ట్” అట…

టాలీవుడ్ లో ఉన్న ఆగ్రహీరోలు, వారి కుటుంబాలను, వారి అభిమానులు దైవాలుగా, కొలుస్తారు. అయితే అదే క్రమంలో వారి నిజ జీవితంలో ఎలా ఉన్నా….వారిలో ఏ లోపాలు ఉన్నా పట్టించుకోరు అభిమానులు. ఇదిలా ఉంటే తాజాగా అక్కినేని వారసుడు అక్కినేని అఖిల్ తన నిజస్వరూపాన్ని మీడియా ముందు బయట పెట్టాడు. అంతేకాకుండా తన గురించి, తన ఫ్యామిలీ గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. ఇంతకీ అఖిల్ చెప్పిన విషయాలు ఏమిటంటే…తన నిజస్వరూపం తన స్నేహితులకు మాత్రమే తెలుసు అని, ఎందుకంటే తనస్నేహితులతో తాను బాగచొరవగా ఉంటానని, అందువల్లనే  తనస్నేహితులంతా తనను ‘శాడిస్ట్’ అని పిలుస్తారని ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు అఖిల్.

అంతేకాకుండా తనకు దెయ్యం సినిమాలు అంటే చచ్చే అంత భయం అని, అలాంటి  సినిమాల  ట్రైలర్స్ కూడా చూడనని, తెలిపాడు. అంతేకాకుండా ఈమధ్య తనకు ఒక దర్శకుడు మంచి హర్రర్ సినిమా కధ చెప్పిన విషయాన్ని గుర్తుకుచేసుకుంటూ   ఆకధ బాగుంది కానీ ఆకధ విన్నతర్వాత ఏడురోజుల పాటు అర్ధరాత్రి సమయంలో పడుకోలేదని తన భయాన్ని తెలిపాడు అఖిల్. అంతటితో ఆగకుండా తన అన్న గురించి సైతం కొన్ని చమత్కారమైన విషయాలు బయట పెట్టాడు అఖిల్. చైతూకు  దెయ్యాలు అంటే భయమని అందుకే  హర్రర్ స్టోరీ అంటేచాలు పరుగు పెట్టేస్తాడన్నవిషయాన్ని వివరించాడు.  తాను ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం  చైతు చేయని పనులను తాను చేసి  తనతండ్రి వద్ద మంచి మార్కులు కొట్టేస్తాను అని తనకు గుర్తున్నవన్నీ చెప్పేసాడు ఈ సిసీంద్రీ.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus