అమల గురించి మీకు తెలియని లైఫ్ సీక్రెట్స్

  • September 12, 2017 / 04:21 AM IST

సున్నిత మనసు కలిగిన మహిళ అమల. కింగ్ నాగార్జున భార్య అయినా సామాన్యురాలిగా జనాల్లోకి వస్తారు. మూగ జీవాల సంరక్షణకు ముందుంటారు. సినిమాల్లో నటిగా మంచి పేరు సంపాదించుకుని, చక్కని ఇల్లాలిగా, గొప్ప తల్లిగా ప్రస్తుతం భాద్యతలు నెరవేరుస్తున్నారు. ఆమె నేడు (సెప్టెంబర్ 12) పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా అమల గురించి ఆసక్తికర విషయాలు…

1. ఎల్లలు దాటిన ప్రేమఅమల తల్లి ఐర్లాండ్‌ దేశస్థురాలు. తండ్రి బంగ్లాదేశ్‌కు చెందినవారు. వారిద్దరిదీ ప్రేమ వివాహం. బంగ్లాదేశ్‌ విడిపోయిన తర్వాత వీరు పశ్చిమ బెంగాల్‌ ల్లో స్థిరపడ్డారు. అమల కలకత్తా లో పెరిగారు.

2. క్లాసికల్ డ్యాన్సర్అమలకు ఎనిమిదేళ్లప్పుడే క్లాసికల్ డ్యాన్స్ పై ఇష్టం ఏర్పడింది. దీంతో ఆమె రుక్మిణిదేవి అరుంగళ్‌ అనే ఫేమస్‌ ఆర్టిస్ట్‌ స్థాపించిన ఇన్‌స్టిట్యూట్‌లో భరతనాట్యం అభ్యసించారు. పదమూడేళ్ల వయసులోనే క్లాసికల్‌ డ్యాన్స్‌ స్టేజ్‌ షోలు చేసేవారు. ఇండియాతో పాటు విదేశాల్లోను నృత్య ప్రదర్శనలు ఇచ్చారు.

3. నటిగా అవకాశందర్శకుడు టి.రాజేందర్‌ తన సినిమాలో క్లాసికల్‌ డ్యాన్సర్‌ హీరోయిన్‌ కోసం వెతుకుతుంటే అమల కనిపించారు. ఆమె నృత్య ప్రదర్శనకు మెచ్చి తన “మైథిలి” అనే సినిమాలో అవకాశం ఇచ్చారు. ఇలా 1986 లో తమిళ చిత్రం ద్వారా వెండి తెర ప్రవేశం చేశారు.

4. ఐదు భాషల్లో సినిమాలుఐదు భాషల్లో అమల సినిమాలు చేశారు. తమిళంలో 22, కన్నడం 5, మళయాలంలో 2, తెలుగులో 10, హిందీలో 8 చిత్రాల్లో నటించారు..

5. నాగ్ పరిచయం‘కిరాయి దాదా’ చిత్రంతో అమలకు అక్కినేని నాగార్జునతో తొలిసారి కలిసి నటించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత చిన్నబాబు, శివ, ప్రేమ యుద్ధం, నిర్ణయం చిత్రాలలో కలిసి నటించారు..

6. పెళ్లి1991లో నాగార్జున ‘మనం పెళ్లి చేసుకుందాం’ అని అమలను అడిగేసరికి ఆమె ఆశ్చర్య పోయింది. తర్వాత కొంతకాలం ఇద్దరు ఒకరినొకరు అర్ధం చేసుకున్న తర్వాత 1992 లో పెళ్లి చేసుకున్నారు. వారిద్దరి ప్రేమకు ప్రతి రూపం అఖిల్. దీంతో అమల బాబుని, ఇంటిని చూసుకునేందుకే సమయం కేటాయించారు.

7. బుల్లి తెరపై జడ్జిపెళ్లి అయినా తర్వాత వెండితెరకు దూరమైనా అమల బుల్లితెరపై కనిపించారు. స్టార్ విజయ్ తమిళ ఛానల్ వాళ్లు నిర్వహించిన “సూపర్ మామ్” షో కి జడ్జిగా వ్యవహరించారు.

8. సినిమాల్లో రీ ఎంట్రీపెళ్లి అయినా తర్వాత అమల 20 ఏళ్ల వరకు సినిమాల వైపు రాలేదు. 2012లో శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ సినిమాతో మళ్లీ వెండితెరపై కనిపించారు. ఈ సినిమాకి గానూ ఉత్తమ నటిగా సినీ‘మా’ అవార్డ్‌ను అందుకొన్నారు.

9. మూగజీవాల రక్షణనాగార్జున ఇచ్చిన సలహాతో హైదరాబాద్‌లో మూగజీవాల రక్షణ కోసం బ్లూక్రాస్‌ సంస్థను అమల ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ద్వారా ఇప్పటివరకు 4 లక్షలకుపైగా మూగజీవాలను సంరక్షించారు. ప్రస్తుతం అన్నపూర్ణ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ మీడియా బాధ్యతలు అమల పర్యవేక్షిస్తున్నారు.

10. బ్యూటీ సీక్రెట్స్అమల ఉదయం లేవగానే వాకింగ్ కి వెళుతారు. యోగ తప్పనిసరి. అప్పుడప్పుడు జిమ్ లో తేలిక పాటి ఎక్సర్‌సైజ్‌లు చేస్తారు. ఆహార నియమాల్లో స్వీట్స్‌ కి దూరంగా ఉంటారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus