కొన్నాళ్లక్రితం నటి అమలాపాల్.. పంజాబీ నటుడు, గాయకుడిని పెళ్లి చేసుకుందని వార్తలొచ్చాయి. వారికి సంబంధించిన ఫొటోలు వైరల్ అయ్యాయి. అయితే.. అది పెళ్లి కాదని, ఒక ప్రమోషనల్ వీడియో షూట్ అని చెప్పింది అమలాపాల్. ఆ తరువాత ఆమె వెబ్ సిరీస్ లు, సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అయితే గతవారం ఆమె పంజాబీ గాయకుడూ భవనిందర్ సింగ్ పై ఆమె కేసు పెట్టడం సంచలనం సృష్టించింది. అతను తన మాజీ బాయ్ ఫ్రెండ్ అని.. ఇప్పుడు కొన్ని ఫొటోలు బయటపెడతానని చెబుతూ..
లైంగికంగా వేధిస్తున్నాడని అమలాపాల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు భవనిందర్ సింగ్ ను అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు అతడికి కోర్టు బెయిల్ ఇచ్చింది. కోర్టులో ఆయన సమర్పించిన ఆధారాల వల్లే అతనికి బెయిల్ వచ్చిందని తెలుస్తోంది. ఇంతకీ అతడు సబ్మిట్ చేసిన ఆధారాలు ఏంటంటే.. 2017లో వీరిద్దరూ పంజాబీ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్న ఫొటోలు, వీడియోలను కోర్టులో సమర్పించారు. అమలాపాల్ చెబుతున్నట్లు అవి ఒక యాడ్ షూట్ కోసమో, పాట కోసమో చేసిన షూట్ కాదని..
నిజంగానే పెళ్లి జరిగినట్లు ఆధారాలు చూపించారట భవనిందర్ సింగ్. ఇద్దరి మధ్య అభిప్రాయబేధాల వలనే విడిగా ఉంటున్నాం కానీ.. తామిద్దరం లీగల్ గా భార్యాభర్తలమే అని అతడు వాదిస్తున్నాడు. అతడి మాటలు నమ్మిన కోర్టు బెయిల్ ఇచ్చిందట. అంటే.. ఇప్పటివరకు అమలాపాల్ చెప్పిన విషయాల్లో నిజం లేదా..? అనే సందేహాలు తలెత్తుతున్నాయి.
కోర్టు భవనిందర్ సమర్పించిన ఆధారాలు నిజమని భావించడంతోనే అతడికి బెయిల్ దొరికిందని అంటున్నారు. ఈ కేసు విషయంలో ఎవరు నిజాలు చెబుతున్నారో..? ఎవరు అబద్దాలు చెబుతున్నారో..? తేలాల్సివుంది.