Amala Paul: వారం తర్వాత శుభవార్త చెప్పిన అమలా పాల్‌… ఫ్యాన్స్‌ ఫుల్‌ హ్యాపీ!

ప్రముఖ కథానాయిక అమలా పాల్‌ (Amala Paul) పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అమలా పాల్‌ స్వయంగా వెల్లడించింది. జూన్ 11న తనకు డెలివరీ అయ్యిందని ఆమె ఆ పోస్టులో తెలియజేశారు. సోమవారం ఆమె బిడ్డతో పాటు ఇంట్లో అడుగుపెట్టిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తాను తల్లి అయిన విషయం తెలియజేశారు. దీంతో అభిమానులు, నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. జూన్ 8న అమలా పాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేసింది.

‘బేబీ కమ్ డౌన్… కమ్ డౌన్’ అనే పాట పాడే సమయం వచ్చిందని అందులో పేర్కొన్నారు. ఆ వీడియో చూసినవాళ్లు అమలా పాల్ నిండు గర్భిణీ అని, త్వరలో డెలివరీ అవుతుందని ఊహించారు. వాళ్లు అనుకున్నట్లే వారం తర్వాత గుడ్ న్యూస్ చెప్పింది. తను తల్లి అయిన విషయంతోపాటు బిడ్డ పేరును కూడా అమలా పాల్‌ తెలియజేసింది. చిన్నారికి ఇలయ్ అని నామకరణం చేసినట్లు అమల తెలిపింది. జూన్ 11న అబ్బాయి పుట్టాడు.

మా చిన్నారి, మా మిరాకిల్… ఇలయ్‌ను చూడండి. అని అమలా పాల్ సోషల్‌ మీడియా పోస్టులో పేర్కొంది. అయితే చాలామంది సెలబ్రిటీల్లాగే వీడియోలో చిన్నారి ముఖం కనిపించకుండా జాగ్రత్తపడ్డారు. గత ఏడాది నవంబర్ 6న జగత్ దేశాయ్‌ను అమల పెళ్లి చేసుకుంది. వివాహానికి పది రోజుల ముందు అంటే అక్టోబర్ 26న తమ ప్రేమ విషయాన్ని జగత్ దేశాయ్ అందరికీ తెలిపారు. ఆ రోజు అమల పుట్టిన రోజు కావడం విశేషం.

జనవరి 3న తాను గర్భవతి అని అమలా పాల్‌ పాల్ ప్రపంచానికి చెప్పింది. అప్పటి నుండి బేబీ బంప్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చింది. ఇటీవల సీమంతం వేడుకలను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి కూడా. ఇప్పుడు బిడ్డ వీడియో కూడా అలానే వైరల్‌ అవుతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus