రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్న అమలాపాల్!

  • September 28, 2018 / 11:07 AM IST

అమాయకత్వమైన కన్నులతో.. హాట్ బాడీతో ఆకర్షించే బ్యూటీ అమలా పాల్. ప్రేమ ఖైదీ సినిమా ద్వారా  తెలుగువారికి పరిచయమయిన ఈ సుందరి…  ఇద్దరమ్మాయిలతో, నాయక్ సినిమాల్లో మెగా హీరోల పక్కన స్టెప్పులు వేసి ఆకట్టుకుంది. అలా తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే  తమిళ దర్శకుడు విజయ్ ని ప్రేమించి పెళ్ళిచేసుంది. తర్వాత ఇద్దరి మధ్య గొడవల వల్ల విడాకులు తీసుకుంది. ఆ బాధ నుంచి వెంటనే కోరుకొని అమలా పాల్ సినిమాలతో బిజీ అయింది. ప్రస్తుతం రాక్షసన్‌ చిత్రంలో విష్ణువిశాల్‌ కి జంటగా నటిస్తోంది. ఇది త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా అనేక విషయాలను వెల్లడించింది. “ఈ సినిమా నాకు  విష్ణువిశాల్‌ లాంటి మంచి మిత్రుడుని అందించింది.

రాక్షసన్‌ చిత్రంలో నా పాత్రకు నేనే డబ్బింగ్‌ చెప్పుకోవడం ఆనందాన్ని ఇస్తోంది. ఒకరు నటించిన పాత్రకు వేరొకరు డబ్బింగ్‌ చెప్పడం అన్నది బిడ్డను కని వేరొకరికి ఇవ్వడం లాంటిది అనీ అందుకే నా పాత్రకు నేనే డబ్బింగ్‌ చెప్పుకుంటానన్న కండిషన్‌తోనే ఈ చిత్రాన్ని అంగీకరించాను” అని వెల్లడించింది.  చాలా మంది తారలు రాజకీయంలోకి అడుగు పెడుతున్నారు.. మీకూ అలాంటి కోరిక ఉందా? అని ప్రశ్నించగా.. “భవిష్యత్‌లో నేను కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తాను” అని స్పష్టం చేసింది. అలాగే “ఆడై” అనే తమిళ చిత్రంలో అందాలు ఆరబోయడంపై అమలను ప్రశ్నించగా.. ఆ చిత్ర కథకు అవసరం అవడం వల్లే అలా నటించాల్సి వస్తోందని చెప్పింది. త్వరలోనే బాలీవుడ్ లోను అడుగుపెట్టబోతోన్న బ్యూటీని రెండో పెళ్లి ఎప్పుడని అడిగితే మాత్రం.. ఆ ప్రశ్న మాత్రం అడగొద్దని అంటోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus