తన మొదటి ప్రేమికుడిని కౌగిలించుకున్న అమలాపాల్

ప్రేమ ఖైదీ సినిమా ద్వారా అమలాపాల్ తెలుగువారికి పరిచయమయింది. ఆ తర్వాత ఇద్దరమ్మాయిలతో, నాయక్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అలా తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా ఉన్నప్పుడు తమిళ దర్శకుడు విజయ్ ని ప్రేమించి పెళ్ళిచేసుంది. తర్వాత ఇద్దరి మధ్య గొడవల వల్ల విడాకులు తీసుకున్నారు. ఆ బాధ నుంచి వెంటనే కోరుకొని అమలా పాల్ సినిమాలతో బిజీ అయింది. ప్రస్తుతం తమిళంలో ఒక సినిమా, మలయాళంలో మరో మూవీ చేస్తోంది. తాజాగా తన మొదటి ప్రేమ సంగతులు బయట పెట్టింది. తనకు చిన్నతనం నుంచి హీరో మాధవన్ అంటే ఎంతో ఇష్టమని తెలిపింది.

అతని సినిమాలు మిస్ కాకుండా చూసేదాన్నని వెల్లడించింది. ఈ విషయాన్ని చెప్పినప్పుడు ఆమె పక్కనే మాధవన్ కూడా ఉన్నాడు. అమలాపాల్ చెప్పిన మాటలకు మాధవన్ నవ్వుకున్నారు. అమలాపాల్ మాత్రం లేచి, అతన్ని కౌగిలించుకుంది. చాకోలెట్ బాయ్ గా పేరుతెచ్చుకున్న మాధవన్ అనేక మంది కలల రాకుమారుడిగా పేరుందక్కించుకున్నారు. ఇప్పటికీ అతనిపై క్రేజ్ తగ్గలేదు. నెగటివ్ రోల్స్ పోషిస్తున్నప్పటికీ అతనితో కలిసి నటించాలని హీరోయిన్స్ ఆశపడుతున్నారు. మరి అందరి ముందు ఇష్టమని చెప్పిన అమల పాల్ కి తనతో కలిసి నటించే అవకాశం మాధవన్ ఇస్తారో లేదో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus