అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా పైన సెన్సార్ రివ్యూ

మాస్ మహారాజ రవితేజ, ఇలియానా జంటగా, శ్రీనువైట్ల దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘అమర్ అక్బర్ ఆంటోనీ’. హీరో రవితేజ, డైరెక్టర్ శ్రీనువైట్ల అంటే ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉంటాయి. ప్రస్తుతం సరైన సక్సెస్ కోసం చూస్తున్న శ్రీనువైట్ల కెరియర్ కి ఇది చాలా కీలకమైన సినిమా అని చెప్పవచ్చు. ఇక ఇప్పటికే రిలీజ్ అయినా టీజర్, ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందనే వస్తుంది. ఈ నెల 16 న రాబోతున్న ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకొని యూ/ఏ సర్టిఫికెట్ దక్కిచుకుంది.

ఈ సినిమా సెన్సార్ పూర్తి కావడంతో సెన్సార్ టాక్ ఏంటనేది బయటకి వచ్చింది. హీరో రవితేజ మూడు క్యారక్టర్ లలో సూపర్ గా చేసాడని, కథ లో కామెడీ ఉంటూనే థ్రిల్లింగ్ కి గురి చేసే అంశాలు కూడా ఉన్నాయని, శ్రీనువైట్ల కామెడీ అంటే వెంకీ సినిమాలో ట్రైన్ ఎపిసోడ్, దూకుడు సినిమాలో ఎం.ఎస్.నారాయణ కామెడీ ఎపిసోడ్ ఎలా అయితే ప్రేక్షకులని కడుబూబ్బా నవ్వించాయో ఈ సినిమాలో కూడా వాటా అనే పేరుతో వచ్చే ఒక ఎపిసోడ్ లో కమెడియన్స్ పండించిన హాస్యం హై లైట్ అని, ఇందులో సినిమా వాళ్ళపైన కూడా కొన్ని సెటైర్ లు ఉన్నవి అంటూ సెన్సార్ సభ్యులు తెలియచేసారు. మరి భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమాని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus