‘అమర్ అక్బర్ ఆంటోని’ మూవీలో హైలెట్స్ ఇవే

మాస్ మహారాజా రవితేజ, ఇలియానా జంటగా, శ్రీనువైట్ల దర్శకత్వంలో, తమన్ సంగీతం అందించగా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోనీ’. ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఇప్పటికే రిలీజ్ అయినా టీజర్, ట్రైలర్ కి మంచి స్పందన వస్తుంది. ఇక ఈ సినిమాలో హీరో రవితేజ మూడు డిఫరెంట్ రోల్స్ లో కనిపించబోతున్నాడు. అయితే ప్లాప్ లో ఉన్న డైరెక్టర్ శ్రీనువైట్ల ఈ సినిమాని తన గత సినిమాలతో పోలిస్తే కొంచం వాటికీ భిన్నంగా ఈ సినిమా తీసినట్లుగా తెలుస్తుంది.

అయితే సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమాలో ఒక యంగ్ కమెడియన్ యాక్టింగ్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి హైలెట్ గా నిలుస్తాయంటా. శ్రీనువైట్ల సినిమా అంటే కామెడీ తప్పకుండ ఎక్సపెక్ట్ చేస్తారు. బ్రహ్మానందం, ఎం.ఎస్.నారాయణ వంటి వారితో కామెడీ ఎలా అయితే రాబట్టుకున్నాడో అలానే యంగ్ కమెడియన్ సత్య ని ఈ సినిమాలో ఆ రేంజులో శ్రీనువైట్ల వాడేసుకున్నాడట. ఇక సినిమాలో తల్లి, కొడుకులకి మధ్య వచ్చే సన్నివేశాలకి తమన్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ మనుసుని హత్తుకునేలా ఉంటుందంటా.

ఈ సినిమాతో చాలా సంవత్సరాల తరువాత హీరోయిన్ లయ రి ఎంట్రీ ఇవ్వడమే కాకుండా తన కూతురిని ఈ సినిమాతో డెబ్యూట్ చేస్తుందట. హీరోయిన్ ఇలియానా కూడా దాదాపుగా ఆరు సంవత్సరాల తరువాత ఈ సినిమాతో తెలుగులో రి ఎంట్రీ ఇస్తుంది. ఏది ఏమైనా డైరెక్టర్ శ్రీనువైట్ల హిట్ కొట్టి మళ్ళీ ఈ సినిమాతో ఫామ్ లోకి వస్తాడో లేదో చూడాలంటే ఈ నెల 16 వరకు ఆగాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus