Bigg Boss 7 Telugu: మెకాళ్లపై కూర్చుని మరీ క్షమాపణ చెప్పిన అమర్..! అసలు ఏం జరిగిందంటే.?

బిగ్ బాస్ హౌస్ లో 9వ వారం వాడి-వేడిగా నామినేషన్స్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నామినేషన్స్ ని రెండోరోజు కూడా పొడిగిస్తూ టెలికాస్ట్ చేశారు. మొదటి రోజు భోలే అమర్ ని నామినేట్ చేస్తూ నువ్వు లాస్ట్ వీక్ కుర్చీ తన్నడం అనేది బాలేదని, బూతులు కూడా మాట్లాడావ్ అని అందుకే నేను హర్ట్ అయ్యానని చెప్పాడు. వీళ్లిద్దరి మద్యలో మాట మాట పెరిగింది. ఆటలో ఇప్పటివరకూ నువ్వు అడిందేమీ లేదు అని భోలే అంటే, మీరు ఏం పిీకారు అంటూ అమర్ కౌంటర్ వేశాడు.

దీనికి భోలే అవాక్కయ్యాడు. ఏం పీకారని ఎలా అంటావ్ అంటూ మాట్లాడాడు. ఆ తర్వాత అమర్ కోపంలోనే సారీ చెప్పాడు. ప్రియాంక కూడా ఈ మాటలని ఖండించింది. ఇక ఆ తర్వాత అమర్ భోలేని తిరిగి నామినేట్ చేశాడు. అంతేకాదు, ఇక్కడే ఆయనకి క్లాస్ పీకే ప్రయత్నం చేశాడు. గతవారం గౌతమ్ ని 2.ఓ అంటూ ఎగతాళి చేశారని అది నాకు నచ్చలేదని చెప్పాడు. అంతేకాదు, ఆయన్ని ఒక ఆట ఆడుకున్నాడు. దీనికి భోలే కౌంటర్ ఎటాక్ చేశాడు. నువ్వు హౌస్ లో బిహేవ్ చేసే తీరు బాలేదని చెప్పాడు.

నేను మంచి పేరు తెచ్చుకుంటే నన్ను అలా అంటావా అన్నాడు. ఇక్కడే అమర్ వెటకారం అనేది ఎక్కువైంది. మీరు మంచివాళ్లు, దేవుళ్లు సార్ నేను బ్యాడ్ బాయ్ ని నన్ను వదిలేయండి అంటూ మాట్లాడాడు. భోలే క్లాస్ పీకాడు. ఇకనైనా నువ్వు మారు అంటూ నామినేషన్స్ కి వెళ్లాడు. అమర్ భోలేని మాటలు అంటూనే ఉన్నాడు. అలాగే భోలే కూడా నేను సిగ్గుపడుతున్నానని , విషం చిమ్ముతున్నావని ఇలా చాలా మాటలు మాట్లాడాడు. దీనికి అమర్ నేను బ్యాడ్ బాయ్ ని ఇలాగే ఉంటా, మీరే అన్నారుగా 10యేళ్ల చిన్నపిల్లాడు అని అందుకే నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నా అంటూ రెచ్చిపోయాడు.

ఇద్దరి మద్యలో చాలామాటలు దొర్లాయి. ఫైనల్ గా నామినేషన్స్ అయిన తర్వాత మోకాళ్లపై కూర్చుని మిమ్మల్ని ఏం పీకావ్ అన్నదానికి మనస్పూర్తిగా సారీ చెప్తున్నా అంటూ చెప్పాడు అమర్. ఇద్దరి మద్యలో చాలాసేపు వాగ్వివాదం జరిగింది. ఆ తర్వాత అమర్ అర్జున్ ని సైతం నామినేట్ చేశాడు. ఓవర్ ఆల్ గా భోలే షవాలి గేమ్ చూసి వచ్చిన తర్వాత అమర్ ఎలాంటి తప్పులు చేస్తున్నాడో చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ, స్టార్ మా బ్యాచ్ కి బుర్రకి ఎక్కడం లేదు.

అంతేకాదు, భోలే షవాలి మాటలకి, చేష్టలకి ఇరిటేట్ అవుతున్నారు. అందుకే, ఆయన ఏది చెప్పినా కూడా తీస్కోవడం లేదు. మాట్లాడే మాటలు కూడా మారిపోతున్నాయి. బాడీ లాంగ్వేజ్ కూడా మారిపోతోంది. మొత్తానికి భోలేకి అమర్ కి పెద్ద మాటల యుద్ధమే అయ్యింది. ఇందులో అమర్ మరోసారి తన నోటి దూలని చూపించుకున్నాడు. తర్వాత క్షమాపణలు కోరాడు. అలాగే, బోలే కూడా అమర్ ఓపికని పరీక్షించేలా మాట్లాడుతునే ఉన్నాడు. దీనికి ఇద్దరికీ గొడవ జరిగింది. గతవారమే (Bigg Boss 7 Telugu) ఇద్దరికీ పడలేదు. ఇప్పుడు అసలు పడట్లేదు. మొత్తానికి అదీ మేటర్.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus