Bigg Boss 7 Telugu: ఆటలో రెచ్చిపోతున్న అమర్.. ప్రశాంత్ కి సమాధానం చెప్పాడా ? అసలు ఏం జరిగిందంటే.?

బిగ్ బాస్ హౌస్ ఇప్పుడు బ్యాంక్ గా మారింది. అందులో ఏటిఎం సెంటర్లో ఎవరైతే ముందుగా బజర్ నొక్కుతారో వాళ్లు అపోజిట్ టీమ్ ని సెలక్ట్ చేసుకుంటారు. అలాగే తమ పార్టనర్ ని కూడా సెలక్ట్ చేసుకుని బిగ్ బాస్ ఇచ్చిన ఛాలెంజ్ ని ఆడతారు. అయితే, ఇక్కడే హౌస్ మేట్స్ మద్యలో పెద్ద లొల్లి అయ్యింది. ముందుగా బజర్ నొక్కింది నేనంటే నేనంటూ హౌస్ మేట్స్ రెచ్చిపోయారు. లైవ్ లో శుభశ్రీ గోల గోల చేసింది. బజర్ టచ్ మాత్రమే అమర్ చేశాడని పూర్తిగా సౌండ్ వచ్చేలాగా నేను కొట్టాను అంటూ చెప్పింది.

దీంతో సంచాలక్ అయిన సందీప్ కి తలనొప్పిగా మారింది. బిగ్ బాస్ మాత్రం చాలాసేపు వేడుక చూస్తూ ఉండిపోయాడు. ఫైనల్ గా బజర్ ముందుగా ఎవరు నొక్కారో 5 నిమిషాల్లో చర్చించుకుని జ్యూరీ మెంబర్స్ అయిన సందీప్, శివాజీ, శోభా చెప్పాలని ఆర్డర్ వేశాడు. దీంతో వాళ్లు సంప్రదింపులు జరిపి సందీప్ ఇంకా శోభా వచ్చి అమర్ పేరు చెప్పారు. నిజానికి అమర్ కొట్టాడా లేదా అనేది మాత్రం సందీప్ కూడా గెస్ చేయలేకపోయాడు. అలాగే, శివాజీ అయితే నేను చూడలేదు కాబట్టి మెజారిటీ ఓటింగ్ కి వెళ్తానని చెప్పాడు.

అమర్ తన పార్టనర్ గా గౌతమ్ ని ఎంచుకున్నాడు. అలాగే, ఆపోజిట్ టీమ్ లో క్వాయిన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తేజని ఎంచుకున్నాడు. అలాగే రతిక ని సెలక్ట్ చేశాడు. దీంతో ఆట మొదలైంది. బిగ్ బాస్ వీరికి స్మైలీ ఫోటో ఛాలెంజ్ ఇచ్చాడు. యాక్టివిటీ ఏరియాలో ఇసుకలో బెల్ట్ కట్టుకుని ఎల్లో బాక్స్ లో నుంచీ ఫోటోలు దిగాలి. ఫోటోగ్రాఫర్ గా శివాజీ, సంచాలక్ గా సందీప్ లని పెట్టాడు. అంతేకాదు, ఇక్కడ ఆపోజిట్ టీమ్ వారిని కేవలం బెల్ట్ తో మాత్రమే పట్టుకుని ఆపాలని కండీషన్ పెట్డాడు.

దీంతో పోటీదారులు రెచ్చిపోయి టాస్క్ ఆడారు. ఫస్ట్ రౌండ్ లో తేజ చాలా బాగా ఆడాడు. దాదాపుగా చాలా ఫోటోలు దిగాడు. అలాగే రతిక కూడా ప్రయత్నం చేసింది కానీ ఫోటోస్ దిగలేకపోయింది. రతికని అమర్ పట్టుున్నాడు. తేజని గౌతమ్ డిపెండ్ చేసాడు. ఆ తర్వాత రౌండ్ లో గౌతమ్ – అమర్ ఇద్దరూ రెచ్చిపోయి వచ్చి ఫోటోలు దిగారు. ఫైనల్ గా శోభా బిగ్ బాస్ ఆదేశం మీరకు ప్లాస్మాలో ప్లే అయిన పోటోల్లోంచి మంచి ఫోటోలని సెలక్ట్ చేసి, సరిగ్గా రానివి డిలీట్ చేసింది.

అమర్ ఇంకా గౌతమ్ ఈ ఛాలెంజ్ లో విన్నర్స్ అయ్యారని చెప్పింది. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన మూడు వారాల్లో అమర్ రెచ్చిపోయి ఆడిన టాస్క్ ఇదే. లాస్ట్ వీక్ నాగార్జున ఇచ్చిన డోస్ బాగా పనిచేసిందని, అందుకే టాస్క్ బాగా ఆడాడని ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు, ఆటతోనే అందరికీ సమాధానం చెప్పాడని, పల్లవి ప్రశాంత్ కి తనేంటో చూపించాలని కూడా ఆడాడని అంటున్నారు బిగ్ బాస్ (Bigg Boss 7 Telugu) లవర్స్. అదీ మేటర్.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus