Vakeel Saab: వకీల్ పైనే ఆశలు పెట్టుకున్న అమెజాన్ ప్రైమ్..?

  • April 29, 2021 / 07:19 PM IST

స్టార్ హీరో పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా రేపటినుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సంగతి తెలిసిందే. 50 రోజుల తరువాత ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కావాల్సి ఉన్నా రోజురోజుకు పెరుగుతున్న కేసుల వల్ల థియేటర్లు మూతబడటంతో రిలీజైన మూడు వారాలకే ఓటీటీలో వకీల్ సాబ్ స్ట్రీమింగ్ కానుంది. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వకీల్ సాబ్ సినిమాతో ఓటీటీలో వ్యూస్ పరంగా కొత్త రికార్డులు క్రియేట్ చేయాలని భావిస్తున్నారు.

సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు రిలీజైన 8 వారాల వరకు ఆన్ లైన్ లో స్ట్రీమింగ్ కావు. కరోనా భయం వల్ల వకీల్ సాబ్ సినిమాను థియేటర్లలో చూడని ప్రేక్షకులు సైతం ఓటీటీలో చూడాలని ఎదురుచూస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ నిర్వాహకులు సైతం ఓటీటీలో ఈ సినిమా భారీగా వ్యూస్ సాధిస్తుందని విశ్వసిస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ పై వకీల్ సాబ్ కు పాజిటివ్ టాక్ వచ్చినా ఈ సినిమాపై కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ పడింది.

ఈ సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లకు పలు ఏరియాల్లో స్వల్పంగా నష్టాలు వచ్చాయి. థియేటర్లలో అబవ్ యావరేజ్ రిజల్ట్ ను అందుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. జాతిరత్నాలు, ఉప్పెన సినిమాలు థియేటర్లలో బాగానే కలెక్షన్లను రాబట్టినా ఓటీటీలలో మాత్రం అనుకున్న స్థాయిలో హిట్ కాలేదు. పవన్ కళ్యాణ్ క్రేజ్ ఉన్న హీరో కావడంతో ఈ సినిమా ఓటీటీ రిజల్ట్ కోసం పవన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

శ్రీరామ్ వేణు ఈ సినిమాకు దర్శకత్వం వహించగా థమన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. శ్రీరామ్ వేణు తరువాత సినిమాలో కూడా పవన్ హీరోగా నటిస్తాడని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. అమెజాన్ ప్రైమ్ నిర్వాహకులు వకీల్ సాబ్ భారీగా వ్యూస్ సాధిస్తుందని ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నారు.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus