Bigg Boss 7 Telugu: ఫ్యామిలీ ఎపిసోడ్ లో ఇదే తలనొప్పి..! ఎంత చెప్పినా వినరా ?

బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరు వచ్చి పలకరించి వెళ్తున్నారు. శివాజీ వాళ్ల పెద్దబ్బాయ్ వచ్చి వాళ్ల నాన్నతో కాసేపు గడిపి వెళ్లాడు. ఆ తర్వాత అర్జున్ వాళ్ల వైఫ్ వచ్చింది. ఆమె కడుపుతో ఉండటం వల్ల బిగ్ బాస్ చీర-గాజులు పంపించి శ్రీమంతం చేయించాడు. దీంతో అర్జున్ వాళ్ల వైఫ్ ఇద్దరూ ఎమోషనల్ అయిపోయారు. అంతేకాదు, బిగ్ బాస్ ప్లే చేసిన సాంగ్ కి హౌస్ మేట్స్ అందరూ కూడా ఏడ్చేశారు.

నిజంగా ఈ ఎపిసోడ్ చూసే ప్రేక్షకులు సైతం భావోద్వేగానికి గురి అయ్యేలా చేసింది. ఇక అర్జున్ వాళ్ల వైఫ్ సురేష అర్జున్ కి చాలా విషయాల్లో హితబోధ చేసింది. నువ్వు కొన్ని విషయాల్లో ఎందుకు సైలెంట్ గా ఉంటున్నావ్, నువ్వు రియాక్ట్ అయితే చూడాలని అనిపిస్తోందని చెప్పింది. అంతేకాదు, చాలాసార్లు ఛాన్స్ వచ్చినా కూడా అరవట్లేదని, ఆర్గ్యూమెంట్ చేయట్లేదని చెప్పింది. మేమందరం దానికోసమే వైయిట్ చేస్తున్నామని, అత్తమ్మ కూడా ఇదే మాట్లాడుతోందని ఎందుకు వీడి అస్సలు మాట్లాడటం లేదని అడిగిందని చెప్పింది.

ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇదే ఉంది అని నొక్కి వక్కాణించింది. దీంతో అర్జున్ కి తన గేమ్ అర్దమైంది. నిజానికి రావడమే మనోడు సందీప్ ని – అమర్ ని నామినేట్ చేసి గట్టిపోటీ ఇచ్చాడు. ఆ తర్వాత టాస్క్ లో కూడా బాగా పెర్ఫామ్ చేసి యావర్ ని ఓడించాడు. అయితే, పల్లవి ప్రశాంత్ ఒక్క విషయంలోనే నోరుజారి వాడ్ని మడతెట్టేయాల్సిందని గౌతమ్ తో అని కొద్దిగా నెగిటివినీ తెచ్చుకున్నాడు. ఈవిషయాన్నే ఇండైరెక్ట్ గా సురేఖ చెప్పే ప్రయత్నం చేసింది.

ఏమీ మాట్లాడకుండా ఉండే, అలాగే సిట్యువేషన్ లో గట్టిగా రియాక్ట్ అవ్వు నువ్వు అరవడమే మాకు కావాలంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు, మిగతా హౌస్ మేట్స్ ఎవ్వరితోనూ మాట్లాడలేదు. అర్జున్ తోనే ఎక్కువ సేపు గడిపింది. ఆ తర్వాత అశ్విని మదర్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అమ్మని చూడగానే గుక్కపట్టి మరీ ఏడ్చేసింది అశ్విని. ఒళ్లో పడుకుని మరీ కబుర్లు చెప్పింది. ఇక అశ్విని వాళ్ల అమ్మ ఇంట్లో పెద్దవాళ్లు చెప్పినట్లుగా విను. నీవాళ్లు అని తిరుగుతున్నావే వాళ్లు నీవాళ్లు కాదు, వద్దనుకున్నవాళ్లే నీ వాళ్లు అంటూ చెప్పింది.

గౌతమ్ తో ఫ్రెండ్షిప్ కట్ చేస్కోమని, శివాజీ గ్రూప్ తో ఉండమని హింట్ ఇచ్చింది. అంతేకాదు, చాలావిషయాలు బయట ఏం జరిగాయ్ అనేది కూడా చెప్పింది. ఇంత క్లియర్ గా హిండ్స్ ఇవ్వడం అనేది ఈ సీజన్ లో బిగ్ బాస్ లో ఇదే మొదటిసారి. ఎప్పుడూ వచ్చే ఫ్యామిలీ మెంబర్స్ ఎలాంటి డైరెక్టర్ మేటర్స్ లీక్ చేయరు. కానీ, ఇప్పుడు వస్తున్న వాళ్లు పార్టిసిపెంట్స్ కి అర్దమయ్యేలా చెప్పేస్తున్నారు. నిజానికి బిగ్ బాస్ హౌస్ లో రూల్స్ ఉంటాయ్.

హౌస్ మేట్స్ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్లేటపుడు ఇవన్నీ కూడా చెప్తారు. అలాగే, వాళ్లకి సంబంధించిన వాళ్లు కూడా వచ్చి టాప్ -5లో ఎవరెవరు ఉంటారు అనేది కూడా అంచనాలు వేస్తుంటారు. మరి ఇలాంటి సమయంలోనే బిగ్ బాస్ లో రూల్స్ ఇంకా స్ట్రిక్ట్ అవ్వాలని , ఫ్యామిలీ ఎపిసోడ్స్ వస్తే ఇదే తలనొప్పి అని, ఎంత చెప్పినా కూడా వాళ్లు వినరని కామెంట్స్ చేస్తున్నారు ఆడియన్స్. మొత్తానికి ఈసీజన్ లో ఉల్టా పుల్టా అని అన్ని (Bigg Boss 7 Telugu) సీజన్స్ చేసినట్లుగానే చేస్తున్నాు. అదీ మేటర్.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus