అమెరికా అధ్యక్షుడు యాక్టర్‌ కూడా తెలుసా? ఏ సినిమాల్లో నటించాడంటే?

అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) ఇటీవల గెలుపొందారు. కమలా హారిస్‌ను ఓడించి రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా జయ కేతనం ఎగురవేశారు. త్వరలో అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన గురించి మాట్లాడుకుంటే సినిమా ప్రస్తావన కూడా వస్తుంది. ఎందుకంటే ఆయన రాజకీయాల్లోకి యాక్టివ్‌గా రాకముందు సినిమాల్లో నటించారు. డొనాల్డ్‌ ట్రంప్‌ వృత్తి రీత్యా రాజకీయ నాయకుడు కాదు. 80వ దశకంలో న్యూయార్క్‌లో రియల్‌ ఎస్టేట్‌ స్టార్‌గా పేరొందాడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump).

Donald Trump

ఆ సమయంలోనే చాలా సినిమాల్లో అతిథి పాత్రల్ని పోషించారు. వ్యాపారాలు చేస్తున్న సమయంలో కొన్ని సినిమాల్లో అతిథి పాత్రల్లో నటించారు. కొన్ని టీవీ షోల్లో కూడా నటించారు. అంతే కాదు రియాలిటీ షోలకు హోస్ట్‌గా కూడా వ్యవహరించారు. ‘గోస్ట్స్‌ కాంట్‌ డూ ఇట్‌’ అనే రొమాంటిక్‌ కామెడీ సినిమాతో 1989లో సినిమాల్లోకి అడుగుపెట్టారు ట్రంప్‌ . ఆ తర్వాత ‘హోమ్‌ అలోన్‌ 2’లో అతిథి పాత్రలో నటించారు. ‘లిటిల్‌ రాస్కల్స్‌’ అనే కామెడీ సినిమాలో తండ్రి పాత్ర (వాల్డో జాన్‌స్టన్‌)లో కనిపించి నవ్వులు పంచారు.

ఆ తర్వాత ‘జూలాండర్‌’, ‘అక్రాస్‌ ది సీ ఆఫ్‌ టైమ్‌’, ‘సెలబ్రిటీ’, ‘ది అసోసియేట్‌’, ‘ఎడ్డీ’, ‘టూ వీక్స్‌ నోటీస్‌’, ‘వాల్‌ స్ట్రీట్‌: మనీ నెవర్‌ స్లీప్స్‌’, ‘పీఓఎం వండర్‌ఫుల్‌ ప్రెజెంట్స్‌’, ‘స్మాల్‌ పొటాటోస్‌ హూ కిల్‌ యూఎస్‌ఎఫ్‌ఎల్‌’, ‘54’, ‘న్యూయార్క్‌’, లాంటి సినిమాల్లో నటించారు. ఇక షోల సంగతి చూస్తే.. ‘హోవార్డ్‌ స్టెర్న్‌’ అనే షోలో 24సార్లు పాల్గొన్నారు. 2004లో ట్రంప్‌ (Donald Trump ) ‘ది అప్రెంటిస్‌’ అనే రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరించారు. అన్నట్లు ఆ షోకి ప్రొడ్యూసర్‌ కూడా ఆయనే.

టీవీల సంగతి చూస్తే.. ‘ది జెఫర్‌సన్స్’, ‘ఐ విల్‌ టేక్‌ మాన్‌హట్టన్‌’, ‘సెయింట్‌ అండ్‌ గ్రీవ్‌సీ’,‘ది ఫ్రెష్‌ ప్రిన్స్‌ ఆఫ్‌ బెల్‌ ఎయిర్‌’, ‘ది నానీ’, ‘సడన్‌లీ సుసాన్‌’, ‘హావర్డ్‌ స్టర్న్‌’ తదితర షోస్‌లో కనిపించారు. ఆఖరిగా 2020లో ‘ఫియర్‌ సిటీ: న్యూయార్క్‌ వర్సెస్‌ మాఫియా’ షోలో కనిపించారు. వాటితోపాటు ‘ప్లేబాయ్ సెంటర్‌ఫోల్డ్‌’, ‘ప్లేబాయ్‌ వీడియో సెంటర్‌ ఫోల్డ్‌: ప్లేమేట్‌ 2000 బెర్నోలా ట్విన్స్‌’ లాంటి పెద్దల సినిమాల్లోనూ నటించారు. పెద్దల సినిమా అంటే తెలుసు కదా? అదే. ఇక ఆయన నటనకు అవార్డులు కూడా వచ్చాయి.

ఆ కీ క్యారెక్టర్‌ వదులుకున్న స్టార్‌ మ్యూజిక్‌ డైరక్టర్‌… ఎందుకంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus