Dasara: ఆ కీ క్యారెక్టర్‌ వదులుకున్న స్టార్‌ మ్యూజిక్‌ డైరక్టర్‌… ఎందుకంటే?

దసరా (Dasara) సినిమా ఆ స్థాయి ఫలితం సాధించింది అన్నా.. సినిమాకు ఇప్పుడు అన్నేసి అవార్డులు వస్తున్నాయి అన్నా.. దానికి ముగ్గురు ప్రధాన నటులు కారణం అని చెప్పొచ్చు. వాళ్లే ధరణి, వెన్నెల, సూరి. సినిమా ఈ ముగ్గురు చుట్టూ నడుస్తుంది. ఆ మూడు పాత్రలను పోషించింది నాని (Nani), కీర్తి సురేశ్‌ (Keerthy Suresh), జీవీ ప్రకాశ్ (G. V. Prakash Kumar)  అని మనం ఇప్పుడు రాసుకోవాల్సి ఉండేది. కానీ కొన్ని కారణాల వల్ల ఆఖరి పేరు మారింది. ఈ విషయాన్నిజీవీ ప్రకాశ్‌ చెప్పారు.

Dasara

నాని కెరీర్‌లో బెస్ట్ సినిమాలు అని ఓ లిస్ట్‌ రాస్తే అందులో ‘దసరా’ సినిమా కచ్చితంగా ఉంటుంది. అంతలా ఆ సినిమా అదరగొట్టింది. నానికి మాస్ అవతార్‌ను అందించిన సినిమా అది. శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలంగాణలోని గోదావరిఖనిలో ఉన్న సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో సాగుతుంది. ఆ సినిమాలో ధరణి (నాని) స్నేహితుడు సూరిగా దీక్షిత్ శెట్టి (Dheekshith Shetty) నటించాడు. అయితే ఆ పాత్రకు ముందుగా మరో హీరోను అనుకున్నారట.

ఆయనే ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్. ‘దసరా’ సినిమాలో నేను నటించాల్సింది. అయితే ఆ సమయంలో డేట్స్‌ సర్దుబాటు కాక నటించలేదు. అయితే మంచి కథ, పాత్ర వస్తే ఈ సారి తప్పకుండా అని చెప్పాడు. ఇప్పటికే తమిళ హీరోలు మన దగ్గర వరుస సినిమాలు చేస్తున్నారు. మంచి విజయాలు కూడా అందుకుంటున్నారు. ఆ లెక్కన జీవీ ఏ సినిమాతో వస్తాడో చూడాలి. ఇక జీవీ సంగీత దర్శకుడి కెరీర్‌ చూస్తే.. వరుస విజయాలతో బిజీగా ఉన్నారు.

శివకార్తికేయన్‌(Sivakarthikeyan), సాయిపల్లవి (Sai Pallavi)  ‘అమరన్’ (Amaran), దుల్కర్‌ సల్మాన్‌  (Dulquer Salmaan)  – మీనాక్షి చౌదరి  (Meenakshi Chaudhary) ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar)  సినిమాలకు ఆయనే సంగీతం అందించారు. ఇటీవల దీపావళి సందర్భంగా విడుదలైన ఈ సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి. వరుణ్ తేజ్(Varun Tej)  ‘మట్కా’  (Matka) సినిమాకు జీవీ ప్రకాశ్‌ కుమారే సంగీతం అందించారు. ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది.

ప్లాన్‌ చేశాం అంటున్న నిర్మాతలు.. కానీ సుకుమార్‌ రిలీజ్‌ ప్లాన్స్‌ వేరేలా ఉన్నాయట!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus