‘బాలయ్య’కు బిగ్ బీ షాక్!!!

టాలీవుడ్ నట సింహం బాలయ్య బాబు ప్రస్తుతం తన పరిష్టాత్మక 100వ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే..అయితే అదే క్రమంలో ఈ సినిమా షూటింగ్ శేరవేగంగా జరగుతూ ఉండడమే కాకుండా….దాదాపుగా చివరి దశకు చేరుకుంది….ఇక సంక్రాంతి బరిలో నిలిచేందుకు సర్వం సిద్దం చేసుకుంటున్న తరుణంలో ఈ సినిమా తరువాత బాలయ్య తన 101వ సినిమా కృష్ణ వంశీ దర్శకత్వంలో ‘రైతు’ అన్న టైటిల్ లో చెయ్యబోతున్నాడు అని ఇప్పటికీ తెలిసిన వార్త. అయితే ఇదిలా ఉంటే తన 101 వ చిత్రం రైతు కోసం కృష్ణ వంశీ తో కలిసిన బాలయ్య ఇందులో ప్రత్యేక పాత్ర కోసం అమితాబ్ బచ్చన్ ని అడిగిన సంగతి తెలిసిందే. ఇందుకు తగ్గట్లుగానే ఈ మూవీలో కీలకమైన ఓ పాత్ర(రాష్ట్రపతి) కోసం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ను పర్సనల్ గా కలిసి మాట్లాడారు బాలయ్య.

ఇక సాక్షాత్తూ బాలీవుడ్ మెగాస్టార్ మన నట సింహం తో కలసి నటించబోతున్నారు అని తెల్సిన నందమూరి అభిమానులు ఆనందంతో మునిగి తేలిపోయారు…అయితే ఏమయిందో ఏమో సడన్ గా బిగ్ బీ బాలయ్య సినిమాలో నటించడం కుదరదు అని సమాచారం అందినట్లు తెలుస్తుంది…దానికి గల కారణాలు ఏంటి అంటే….తన కాల్ షీట్ కుదరక పోవడం వల్లనే బిగ్ బీ ఈ సినిమాలో నటించలేకపోతున్నాడు అని తెలుస్తుంది. వచ్చే ఏడాది జూలై వరకూ డేట్స్ లేవు అనీ ఆ తరవాత మాత్రం కాసిన్ని రోజులు డేట్స్ ఇవ్వగలను అని అమితాబ్ చెప్పినట్టు తెలుస్తోంది.  కానీ బిగ్ బీ కోసం బాలయ్య అన్ని రోజులు షూటింగ్ వాయిదా వేసుకుంటారా అనేది చెప్పలేని పరిస్తితి. చూడాలి మరి బిగ్ బీ స్థానంలో ఎవరికి అవకాశం వస్తుందో!!!

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus