ఒకే ఫ్రేములో బిగ్ బీ-బాలయ్య

ఏడుపదుల వయసులో కూడా అలసట అన్నది దరిచేరనివ్వకుండా వరుస సినిమాలు చేస్తున్నారు లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్. ఇటీవల కాలంలో ఆయన నటించిన కథాబలంతో నిండినవే. వయసుకి తగ్గ పాత్రలను ఎంచుకుంటూ ఆ పాత్రలకి జీవం పోస్తున్న బిగ్ బీ తెలుగు సినిమాలో నటించనున్నారన్నది ప్రస్తుతం వేడి పుట్టిస్తున్న విషయం.నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా కృష్ణవంశీ ‘రైతు’ అనే సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. బాలయ్య వందో సినిమా కావాల్సిన ఈ సినిమా సినిమా 101కి వచ్చి చేరుకుంది. ఇటీవల ముంబైలో అమితాబ్ తో బాలయ్య, కృష్ణవంశీ భేటీ అయ్యారు. ఇదేదో మర్యాద పూర్వక కలయిక అనడానికి వీలు లేదు. ఎందుకంటే వారు కలిసింది ‘సర్కార్ 3’ సినిమా చిత్రీకరణలో.

కృష్ణవంశీ గురువు వర్మని కలవడానికి వెల్లడనుకున్నా బాలయ్య ఎందుకు వెళ్లినట్టు అని అనుమానాలు రేగుతున్నాయి. తెలియవస్తున్న సమాచారం ప్రకారం ‘రైతు’ సినిమాలో కీలక పాత్రలో అమితాబ్ ని నటింపజేయడమే ఈ భేటీ ఉద్దేశ్యం అని తెలుస్తోంది.అక్కినేని త్రయం నటించిన ‘మనం’లో అతిథి పాత్ర మినహా బిగ్ బీ మరే తెలుగు సినిమాలోను కనపడలేదు. ఇప్పుడు అమితాబ్ గనక ఈ సినిమా చేస్తే అంచనాలు ఆకాశాన్ని తాకుతాయనడంలో సందేహం లేదు. ‘నిన్నే పెళ్లాడతా’ సినిమాలో సంజయ్ దత్ ని తెలుగు ప్రేక్షకులకు చూపించిన కృష్ణవంశీ ఇప్పుడు ఏకంగా అమితాబ్ నే తెలుగు తెరమీదికి తీసుకొస్తున్నారు. దీనిపై అధికారిక కబురు త్వరలోనే అందనుంది. అన్నట్టు కృష్ణవంశీ తొలి సినిమా ‘గులాబీ’కి అమితాబ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. బిగ్ బీ నిర్మించిన తొలి సినిమా ఇదే కావడం విశేషం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus