అద్దె రూపంలో అమితాబ్ సంపాదన అన్ని కోట్లా?

బిగ్ బీ అమితాబ్ బచ్చన్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాల ద్వారా, కౌన్ బనేగా కరోడ్ పతి షో ద్వారా అమితాబ్ లక్షల రూపాయలు సంపాదిస్తున్న సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్ ముంబై నగరంలోని ఖరీదైన ప్రాంతాలలో ఒకటైన జుహు ప్రాంతంలో ఉన్న రెండు బంగ్లాల గ్రౌండ్ ఫ్లోర్ ను 15 సంవత్సరాలకు లీజుకు ఇచ్చారని సమాచారం. zapkey.com అనే వెబ్ సైట్ ఈ విషయాలను వెల్లడించింది.

పది రోజుల క్రితం ఈ ఒప్పందం జరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అమితాబ్ నివశిస్తున్న కుటుంబం పక్కనే ఈ బంగ్లాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ బంగ్లా మొత్తం 3,150 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉందని సమాచారం అందుతోంది. నెలకు 18.9 లక్షల రూపాయల అద్దెతో రెండు బంగ్లాలను అద్దెకు ఇచ్చారని తెలుస్తోంది. ప్రతి ఐదేళ్లకు 25 శాతం అద్దెను పెంచుకునే విధంగా నిబంధన ఉంది. బ్యాంకు ఇప్పటికే అమితాబ్ ఫ్యామిలీకి 2.26 కోట్ల రూపాయలు డిపాజిట్ రూపంలో చెల్లించినట్టు తెలుస్తోంది.

గతంలో ఈ ప్రాంగణాన్ని అమితాబ్ సిటీ బ్యాంకుకు లీజుకు ఇచ్చినట్టు సమాచారం. సంవత్సరానికి 2 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం అమితాబ్ అద్దె రూపంలో సంపాదిస్తుండటం గమనార్హం. ప్రముఖులు, వ్యాపార టైకూన్లు ఈ ప్రాంతంలో ఎక్కువగా నివశిస్తున్నారని తెలుస్తోంది. అమితాబ్ కు ముంబైలోని ఇతర ఏరియాల్లో సైతం ఖరీదైన బంగ్లాలు ఉన్నాయి. అయితే ఈ వార్తల గురించి అమితాబ్ బచ్చన్ ఇప్పటివరకు స్పందించలేదు.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus