Project K: ప్రభాస్ సినిమాలో అమితాబ్ ఇలా కనిపించబోతున్నారట..!

ప్రభాస్ హీరోగా ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీ ‘ప్రాజెక్ట్ కె’.ఈ సినిమా అసలు టైటిల్ ఇంకా రివీల్ చేయలేదు.. త్వరలోనే రివీల్ చేయనున్నట్లు నాగ్ అశ్విన్ టీం తెలిపింది. ఇంటర్నేషనల్ మార్కెట్స్ ను టార్గెట్ చేస్తూ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు ఈ చిత్ర నిర్మాత అశ్వినీదత్ ఓ సందర్భంలో తెలియజేశారు. దీపికా పదుకొనె తెలుగులో నటిస్తున్న స్ట్రైట్ మూవీ ఇది. ఇందులో ప్రభాస్ సరసన ఆమె నటిస్తోంది.

అలాగే అమితాబ్ బచ్చన్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా (Project K) ‘ప్రాజెక్ట్ కె’ లో అమితాబ్ పాత్రకు సంబంధించిన ఓ పిక్ లీక్ అయ్యింది.ఈ ఫోటో అమితాబ్ ను సైడ్ యాంగిల్ లో తీసినట్టు స్పష్టమవుతుంది. ‘ప్రాజెక్ట్ కె’ లో అమితాబ్ పాత్ర ఏమిటన్నది ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ఆయన .. అశ్వ‌ద్ధామ‌ పాత్రని పోషిస్తున్నట్టు టాక్ నడుస్తుంది. పురాణాల గురించి తెలిసిన వారికి అశ్వద్ధాముడు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.

చావే లేని వాళ్ళుగా ఆంజ‌నేయుడు, అశ్వ‌ద్ధామ ల గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. ఇప్పటికీ వీళ్ళు బ్రతికే ఉన్నారు అనేది కొంతమంది న‌మ్మ‌కం. ఆంజ‌నేయుడు ఇంకా హిమాలయాల్లో తిరుగుతూ ఉంటాడని కొందరు చెబుతుంటారు. అది వాళ్ళ నమ్మకం కావచ్చు కూడా..! ఒకవేళ అశ్వ‌ద్ధామ కూడా బ్రతికుంటే ఎలా ఉంటుంది..? అనే థీమ్ తో ఈ చిత్రంలో అమితాబ్ అశ్వద్ధామ పాత్రని దర్శకుడు నాగ్ అశ్విన్ తీర్చిదిద్దినట్టు తెలుస్తుంది.ప్రస్తుతానికి అమితాబ్ లీక్డ్ పిక్ వైరల్ అవుతుంది.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus