కొత్త ప్రయాణం మొదలు పెట్టనున్న అమీ జాక్సన్..!

మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా వచ్చిన ‘ఎవడు’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయంమయ్యింది అమీజాక్సన్. ఇక అటు తరువాత ధనుష్ తో ‘నవ మన్మధుడు’ శంకర్ డైరెక్షన్లో వచ్చిన ‘ఐ’ ‘2.0’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల్ని బాగా ఆకర్షించింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సంవత్సరం అమీ జాక్సన్ పెళ్ళి చేసుకోబోతుందని సమాచారం.

దీనికి సంబంధించి సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ కి కూడా క్లూ ఇచ్చింది. న్యూ ఇయిర్ సెలబ్రేషన్స్ సందర్బంగా జాంబియాలోని ఎగ్జోటిక్ లొకేషన్లకు వెళ్ళిన అమీజాక్సన్ అక్కడ ప్రియుడు జార్జ్‌ పనాయొటో ను కలుసుకుంది. ఇక అమీ జాక్సన్ తన ‘ఇన్ స్టా గ్రామ్’ ద్వారా స్పందిస్తూ… “జీవితంలో కొత్త సాహసాలు మొదలైనట్టే… ఐ లవ్ యు… ప్రపంచంలోనే ఎంతో హ్యాపీయెస్ట్ గాళ్ ని చేసినందుకు..“ అంటూ ప్రియుడు తో ఉన్న ఫోటోను షేర్ చేసింది. దీనితో పాటు “నిశ్చితార్థ ఉంగరం ఈమోజీ“ని కూడా ఎమీజాక్సన్ పోస్ట్ చేయడం విశేషం.గత కొంతకాలంగా జార్జ్‌ పనాయొటో తో డేటింగ్ లో ఉంది మీ జాక్సన్. ఇక జార్జ్‌ పనాయొటో లండన్ లో మల్టీ మిలియనీర్. ఇక వీరి వివాహం ఎప్పుడు జరుగబోతుందనేది తెలియాల్సి ఉంది

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus