అసలు చిరంజీవి, సురేఖల పెళ్లి ఎలా జరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో పాటు బాలీవుడ్ లో కూడా ఫేమస్ అయిన స్టార్ హీరో? ఇప్పుడు టాలీవుడ్ లో ఎంత మంది స్టార్ హీరోలున్నా వాళ్లకు మించిన హిట్లందిస్తున్నారు మెగాస్టార్ అంటే ఆయన రేంజ్ ఏంటనేది అందరికీ అర్ధమయ్యే ఉంటుంది. ఇదిలా ఉండగా.. చిరంజీవి భార్య సురేఖ గారు అల్లు రామలింగయ్య గారి కూతురు అన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో ఉన్న అన్యోన్య దంపతులలో చిరు- సురేఖ ముందు వరుసలో ఉంటారు.తాజాగా వీళ్ళిద్దరూ కలసి పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో వారి పెళ్లి సంగతులను తెలియజేసారు.

ఈ సంగతుల్ని చిరంజీవి వివరిస్తూ.. “నేను చెన్నైలో కోడంబాకం బ్రిడ్జ్ పై నా కారులో వెళుతున్నాను. అప్పుడు నా క్లాస్ మేట్ సత్యనారాయణ కనిపించాడు. ఎక్కడికి వెళుతున్నావు అని అడిగాను. ‘మా పెదనాన్న గారి ఇంటికి వెళుతున్నాని’ చెప్పాడు. కారులో దిగబెడతా రా అని అతన్ని ఎక్కించుకున్నాను. వాళ్ళ పెదనాన్న ఎవరో కాదు.. అల్లు రామలింగయ్య గారు. అప్పటికి నేను ఆయనతో మూడు చిత్రాల్లో నటించాను. ‘మా పెదనాన్నతో కలిసి నటించావుగా..లోపలికి రా.. కాఫీ తాగి వెళ్లు’ అని సత్యనారాయణ పిలిచాడు. ఆ టైములో రామలింగయ్య గారు ఇంట్లో లేరు. వాళ్ళ అమ్మాయి సురేఖ, కుటుంబ సభ్యులు ఉన్నారు. సురేఖే కాఫీ పెట్టింది. అదే నేను లాక్ అయిన మొదటి స్టెప్.’ఆ అబ్బాయి ఎవరు.. కుల గోత్రాలు ఏంటి’ అని మా ఫ్రెండ్ తో సురేఖ ఆరా తీసిందట. మనవాడే అని నా ఫ్రెండ్ నా గురించి చెప్పాడట. ఆ తర్వాత అల్లు రామలింగయ్య గారు, అల్లు అరవింద్ గారు నా గురించి ఆరా తియ్యడం మొదలు పెట్టారని తెలిసింది. ‘నేను బాగా చదువుకున్నానని, చెడు అలవాట్లు లేవని’ నా ఫ్రెండ్ సత్యనారాయణ.. అల్లు అరవింద్ తో నా గురించి బాగా చెప్పాడట. చేతిలో మంచి సినిమాలు కూడా ఉన్నాయని తెలిపాడట నా ఫ్రెండ్. పలువురు నిర్మాతలని కూడా నా గురించి అడిగి తెలుసుకున్నారట అల్లు రామలింగయ్య గారు. ఆ తర్వాతే మా ఫ్యామిలీని సంప్రదించారని తెలిసింది. నేను మాత్రం ఇప్పుడే పెళ్లి చేసుకోను అని చెప్పాను. కానీ అల్లు రామలింగయ్య గారు మా నాన్నని బలవంతపెట్టారు. అలా పెళ్లి చూపులకు వెళ్లాం” అంటూ చిరు చెప్పుకొచ్చారు.

సురేఖ మాట్లాడుతూ.. “ఆయన్ని చూడడం కంటే ముందుగానే మనవూరి పాండవులు చిత్రం చూశాను. ఈ అబ్బాయి చాలా బావున్నాడు..పెద్ద కళ్ళు, గుండ్రంగా ఉన్నాయి అని అనిపించింది.మా నాన్న గారు కూడా నటుడే.! నేను కూడా నటుడ్ని పెళ్లి చేసుకోవాలని అనుకునే దాన్ని. అలా చిరంజీవితో పెళ్లి చూపులకు ఒప్పుకున్నాను” అంటూ సురేఖ చెప్పుకొచ్చారు.

ఇక పెళ్లి చూపుల గురించి చిరు మాట్లాడుతూ.. “మమ్మల్ని మాట్లాడుకోమని పెద్దవాళ్ళు బయటకు వెళ్లారు. ఆమె బి.ఏ చదువుకుందని తెలుసు.. కానీ ఏం మాట్లాడాలో తెలియక ‘ఏం చదువుకున్నారు?’ అని అడిగాను. సురేఖ నాకు నచ్చింది. మా ఇంట్లోవాళ్లకు కూడా నచ్చింది. అలా పెళ్లి చూపులు ముగిశాయి.పెళ్ళంటూ చేసుకుంటే ఈమెనే పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. మా నాన్న గారు కూడా ‘ఏం కళరా ఆ అమ్మాయిది.. నువ్వు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకో’ అన్నారు. ఇప్పట్లోలా అప్పుడు సెల్ ఫోన్స్ లేవు కదా.ఓ రోజు ల్యాండ్ లైన్ నుండీ ఆమె ఇంటి ల్యాండ్ లైన్ కు ఫోన్ చేశాను. సురేఖనే ఫోన్ లిఫ్ట్ చేసింది. ‘నేను సురేఖని మాట్లాడుతున్నా.. ఫోన్ ఎవరికీ ఇమ్మంటారు?’ అని అడిగింది.. ‘తన కోసం ఫోన్ చేస్తే ఇలా మాట్లాడుతోంది ఏంటి?’ అని నా అహం దెబ్బతింది. ‘మీ అన్నయ్య ఉన్నాడా?’ అని అడిగి ఫోన్ పెట్టాశాను” అని చిరు చెప్పారు.

సురేఖ మాట్లాడుతూ.. ‘పెళ్లి పనుల కోసం పెద్దవారితో మాట్లాడడానికి ఫోన్ చేశారేమో’ అని నేననుకున్నాను.అలా సరదా సరదా సంఘటనల మధ్య మా పెళ్లి జరిగింది. ఇక అత్తారింట్లో అడుగు పెట్టక వారందరినీ చూసి నేను షాక్ అయ్యాను. వాళ్లంతా ఎంతో క్రమశిక్షణతో పెరిగారు.నాతో ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. పవన్ కళ్యాణ్ నాతో చాలా అభిమానంగా ఉండేవాడు. మా పిల్లలతో పాటే పెరిగాడు” అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

Most Recommended Video

ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus