దివంగత నాయకురాలు జయలలిత గొప్పతనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి.. తెలుగు మరియు తమిళ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. రాజకీయాల్లో కూడా ఆమె సినిమాలను మించి రాణించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటో 1989 వ సంవత్సరంలోనిది. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి.. బడ్జెట్ ప్రసంగం చేస్తున్న సమయమది. ఆ టైములో ‘మీవన్నీ తప్పుడు హమీలు..
తప్పుడు లెక్కలంటూ’ అప్పటి ప్రతిపక్ష పార్టీ నాయకురాలైన జయలలిత ఆ ప్రసంగాన్ని అడ్డుకుంటూ నిరసనకు దిగారు. దాంతో ‘డి.ఎం.కె’ పార్టీ నేతలు ఈ విషయం పై చాలా సీరియస్ అయ్యారు. అలా పెద్ద గొడవ జరగడానికి కారణం అయ్యింది. ఈక్రమంలో జయలలిత పై కొందరు ‘డి.ఎం.కె’ పార్టీ అభిమానులు దాడి చేసారు. ఆ సమయంలో చిరిగిన చీరతో అసెంబ్లీని వదిలి వెళుతూ….. మళ్ళీ ముఖ్యమంత్రిగానే ఈ సభలో అడుగుపెడతాను’ అంటూ శపథం చేశారు జయలలిత.
ఆమె అలా శపథం చేసినట్టుగానే 1991 ఎన్నికల్లో జయలలిత నాయకత్వంలోని ’ఏ.ఐ.ఏ.డి.ఎం.కె’ పార్టీ… 234 సీట్లకు 225 సీట్లను గెలిచి అధికారంలోకి రావడం విశేషం.దాంతో జయలలిత తొలిసారిగా తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. ఆమె శపథం చేసినట్టుగానే ముఖ్యమంత్రి అయ్యే అసెంబ్లీలో అడుగుపెట్టి అందరి నోళ్ళు మూయించారనే చెప్పాలి.
1
2
3
4
5
Most Recommended Video
ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్