ANR, Nagarjuna: నాగార్జున, నాగేశ్వర రావు లు చేసిన మర్చిపోలేని తప్పు అదేనట..!

అక్కినేని నాగేశ్వరరావు గారితో కలిసి అక్కినేని నాగార్జున… ‘కలెక్టర్ గారి అబ్బాయి’ ‘అగ్నిపుత్రుడు’ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. తర్వాత హ్యాట్రిక్ కొట్టాలనే ఉద్దేశంతో వీరిద్దరూ కలిసి మరో మల్టీస్టారర్లో కూడా నటించారు.కానీ ఆ చిత్రం ప్లాప్ అయ్యింది.ఆ కథ చేయొద్దు అని అప్పట్లో ఇండస్ట్రీకి చెందిన పెద్దలు, హీరోలు సూచించారట. అయినప్పటికీ వీళ్ళు లెక్కచేయకుండా ఆ సినిమా చేసి ప్లాప్ ను మూటకట్టుకున్నట్టు తెలుస్తుంది. అక్కినేని నాగేశ్వర రావు,

నాగార్జున లు చేసిన పెద్ద మిస్టేక్ అదే అని ఇప్పటికీ కొందరు సీనియర్ సినీ ప్రముఖులు చెప్పుకొస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఏ.ఎన్.ఆర్, నాగార్జునలు కలిసి కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ‘ఇద్దరూ ఇద్దరే’ అనే మూవీలో నటించారు.సక్సెస్ ఫుల్ డైరెక్టర్, సక్సెస్ ఫుల్ కాంబినేషన్ కావడంతో అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఈ చిత్రం పై అంచనాలు పెట్టుకున్నారు. ఓ న్యాయమూర్తి కొడుకు చిన్నప్పుడే తప్పిపోయి రౌడీగా మారతాడు.ఈ విషయం తెలుసుకున్న తండ్రి తన కొడుకుని ఎలా మార్చుకున్నాడు అనేది కథ.

పాయింట్ ఇంట్రెస్టింగ్ గానే ఉన్నా.. ఈ సినిమా స్టార్టింగ్ లో నాగార్జున నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో కనిపిస్తాడు. తన తండ్రి ఏ.ఎన్.ఆర్ కు ఎదురుతిరిగే స్వభావం కలిగిన వ్యక్తిగా కనిపిస్తాడు. ఇది అభిమానులకు నచ్చలేదు.కట్ చేస్తే సినిమా ప్లాప్ అయ్యింది. అయితే ‘ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా’ అనే పాట మాత్రం ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తుంది. రాజ్- కోటి ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు.

Most Recommended Video



నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus