మెగా స్టార్ ‘మంచు పల్లకి’ విశేషాలు…!

అప్పటికి కుటుంబ కథా చిత్రాలు తీసే దర్శకులు… మాస్ సినిమాలు తీసే దర్శకులు చాలా మందే ఉండేవారు. ఇక కామెడీ సినిమాలు తియ్యడానికి జంధ్యాల వంటి వారు ఓ ట్రెండ్ ను సృష్టించేసారు.ఇంకా సీనియర్ దర్శకులు చాలా మందే ఇండస్ట్రీలో ఉన్నారు. అయితే ఆ టైములో ఓ కొత్త దర్శకుడు వచ్చి చేసేది ఏముంది..? ఒకవేళ వచ్చినా ఎన్నాళ్ళు అని నిలబడతాడు? అనే అనుమానాలు, ప్రశ్నలు చాలానే వచ్చేవి. అలాంటి టైంలో ఎంట్రీ ఇచ్చాడు వంశీ.

హీరోయిన్లలో మాత్రమే కాదు పిక్చరైజేషన్ లో కూడా గ్లామర్ ఉంటుందని చాటి చెప్పాడు. అతని సినిమాల్లో మామూలు లొకేషన్లు కూడా ఎంతో అందంగా కనిపిస్తాయి.. హెల్ధీ కామెడీ కూడా ఉంటుంది. మంచి మ్యూజిక్ టేస్ట్ కూడా ఉన్న వ్యక్తి. ఆయన మొదటి సినిమా ‘మంచు పల్లకి’ అందరికీ గుర్తుండే ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి, సుహాసిని, రాజేంద్ర ప్రసాద్, సాయి చంద్(ఫిదా ఫేమ్) వంటి వారు ప్రధాన పాత్రలు పోషించారు. 1982 నవంబర్ 19న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది.

మొదటి చిత్రంతోనే దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు వంశీ. ‘పలైవాన సొలై’ అనే తమిళ చిత్రాన్ని మన తెలుగు నేటివిటీకి తగినట్టుగా ఎంతో అందంగా తెరకెక్కించాడు దర్శకుడు వంశీ. అయితే చిరు- వంశీ కాంబినేషన్లో మరో చిత్రం రాకపోవడం ఆశ్చర్యం కలిగించే అంశం. లాక్ డౌన్ టైములో బోర్ ఫీలైతే ‘మంచు పల్లకి’ చిత్రం బెస్ట్ సజిషన్ అనే చెప్పాలి.

Most Recommended Video

దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా?
ఈ ఏడు రీజన్స్ తెలిస్తే ఆర్ ఆర్ ఆర్ ని వదిలిపెట్టరు
అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus