Mahesh Babu, Rajamouli: మహేష్ ఫ్యాన్స్ కు అదిరిపోయే శుభవార్త..?

మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో కేఎల్ నారాయణ్ నిర్మాతగా ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా అంతకంతకూ ఆలస్యమవుతూ ఉండటంతో రాజమౌళి మహేష్ సినిమా విషయంలో మహేష్ ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ విషయంలో జరిగిన తప్పులు మహేష్ సినిమా విషయంలో జరగకూడదని రాజమౌళి భావిస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సమయంలో మహేష్ రాజమౌళి కాంబో సినిమా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసే సమయానికి మహేష్ త్రివిక్రమ్ సినిమాను పూర్తి చేసి సెట్స్ పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ హీరోయిన్లలో ఒకరు ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుండటం గమనార్హం.సాధారణంగా రాజమౌళి తన సినిమా రిలీజయ్యే వరకు మరో సినిమా పనులు మొదలుపెట్టడానికి ఇష్టపడరు. అయితే మహేష్ మూవీని మాత్రం వేగంగా పూర్తి చేసి 2023లో ఆ సినిమా రిలీజ్ చేయాలని రాజమౌళి భావిస్తున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్, చరణ్ లపై వచ్చే నెల నుంచి 8 నిమిషాల పాటను చిత్రీకరించనున్నారని సమాచారం. సినిమాల్లో పాటలకు క్రమంగా ప్రాధాన్యత తగ్గుతున్న తరుణంలో రాజమౌళి ఇంత పెద్ద పాటను చిత్రీకరించడం సాహసమే అని చెప్పాలి. ఈ పాట చిత్రీకరణలో విజువల్ ఎఫెక్ట్స్ కీలక పాత్ర పోషిస్తాయని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి ఎన్నో వార్తలు వస్తున్నా రాజమౌళి మాత్రం రిలీజ్ డేట్ కు సంబంధించిన వార్తలపై స్పందించడం లేదు.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus