ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించేలా ‘మేక్ ఏ విష్’ టీజర్

దర్శక నిర్మాతలు నటిస్తూ సినిమాలను తెరకెక్కించడం అరుదుగా జరగుతుంటుంది. మేక్ ఏ విష్ అనే సినిమా విషయంలో నిర్మాత మరియు దర్శకురాలు కూడా నటిస్తున్నారు. సంధ్య బైరెడ్డి నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని ఏకమ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద కిరణ్ కస్తూరీ నిర్మిస్తున్నారు. వీరితో పాటు మరొక హిరోయిన్ గా రచన యదనపూడి నటిస్తున్నారు. ఈ ముగ్గురు నటిస్తున్న మేక్ ఏ విష్ చిత్రం టీజర్ తాజాగా రిలీజ్ అయింది.

98 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్‌ ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తించేలా ఉంది. టీజర్ గమనిస్తే.. కాసేపు లవ్ స్టోరీ అనిపిస్తుంది.. ఇంకాసేపు సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ అనిపిస్తుంది.. మళ్లీ వెంటనే క్రైమ్ డ్రామా అనిపిస్తుంటుంది. ఇలా అన్ని జానర్లను కలిపినట్టుగా ఈ టీజర్ చూస్తే అర్థం అవుతుంది. టీజర్‌తో సినిమా మీద అంచనాలు పెంచేసింది యూనిట్.

హీరోయిన్లుగా కనిపించిన ఆ ముగ్గురు అమ్మాయిల చుట్టే కథ తిరుగుతుందనిపిస్తోంది. ఆ ముగ్గురూ కూడా టీజర్‌లో తమ ముద్ర వేశారు. ఈ టీజర్‌లో మహవీర్, అభిమన్యు, అడ్రిన్ రియలే కెమెరావర్క్, వారు అందించిన విజువల్స్ అద్భుతమనిపిస్తాయి. ప్రణీత్ కొట్టిన ఆర్ఆర్ అందరినీ ఆకట్టుకునేలా, సీన్లలో లీనమయ్యేలా అనిపిస్తుంది.

సంధ్య బైరెడ్డి, కిరణ్ కస్తూరీ, రచన యదనపూడి మెయిన్ ఫీమేల్ లీడ్స్‌గా రాబోతోన్న మేక్ ఏ విష్ అనే సినిమాలో అభిషేక్ సబ్బే, వరుణ్ వేగినాటి, కార్తీక్ కందల, మహేంద్ర సత్య, నరేన్ వర్మలు ముఖ్య పాత్రలను పోషించారు.

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus