11 ఏళ్ళ ‘భీమిలి కబడ్డీ జట్టు’ రిజల్ట్ ని నాని ఎలా రిసీవ్ చేసుకున్నాడంటే..!

  • July 9, 2021 / 07:18 PM IST

కొన్ని అండర్ రేటెడ్ మూవీస్ లిస్ట్ తీసుకుని చూస్తే కచ్చితంగా అందులో ‘భీమిలి కబడ్డీ జట్టు’ సినిమా కూడా ఉంటుంది. నాని హీరోగా నటించిన ఈ చిత్రం 2010 వ సంవత్సరం జూలై 9న విడుదలైంది.నేటితో ఈ చిత్రం విడుదలై 11ఏళ్ళు పూర్తి కావస్తోంది. అప్పటికే ‘అష్టాచమ్మా’ ‘రైడ్’ వంటి హిట్లు కొట్టిన నాని నటించిన సినిమా కావడంతో దీని పై మంచి అంచనాలే నమోదయ్యాయి. తాతినేని సత్య ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యాడు.

ఫస్ట్ వీకెండ్ ఈ చిత్రానికి ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. చాలా లో బడ్జెట్ లో తీసిన సినిమా కావడంతో కమర్షియల్ గా బయ్యర్స్ పెద్దగా ఇబ్బంది పడలేదు. చెప్పాలంటే చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కూడా సాధించింది ఈ మూవీ. అయితే కొన్ని ఏరియాల్లో మాత్రం డెఫిసిట్ లు పడ్డాయి. ఓ వర్గం ప్రేక్షకులకు ఈ చిత్రం నచ్చలేదు. ఇక వీకెండ్ వరకు పర్వాలేదు అనిపించినా ఈ చిత్రం వీకెండ్ తర్వాత సర్దేసింది. దానికి ముఖ్య కారణం మౌత్ టాక్ బాగోకపోవడం వలెనే అని చెప్పాలి. అలా అని ఈ చిత్రానికి రివ్యూలు బాలేదు అని కాదు.. ఈ చిత్రానికి మంచి రివ్యూలు వచ్చాయి. క్రిటిక్స్ కూడా మంచి మూవీ అని మెచ్చుకున్నారు.

కానీ హీరో చివర్లో ప్రాణాలు కోల్పోవడం అనే పాయింట్ ను ప్రేక్షకులు డైజెస్ట్ చేసుకోలేకపోయారు. అందుకే ఈ మూవీని ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో ఆదరించలేదు. నాని కూడా ఈ చిత్రంలో క్లైమాక్స్ కొత్తగా ఉంటుంది అని భావించినట్టు తెలిపాడు… కానీ ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయలేదు. ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుంది అని భావిస్తే.. సొసొ రిజల్ట్ తో రిజల్ట్ తో సరిపెట్టుకోవడం నానిని డిజప్పాయింట్ చేసిందట. ‘సినిమా ఫస్ట్ నుండీ బాలేదు అనుకుంటే ఓకే కానీ చివర్లో హీరో ప్రాణాలు కోల్పోయాడు అనే ఒక్క పాయింట్ చెప్పి సినిమా బాలేదు అనడం నాకు నిద్ర లేకుండా చేసింది’ అని నాని ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus