Prathibimbalu: ఏఎన్నార్ ‘ప్రతిబింబాలు’ మూవీ వంద రోజుల వేడుక ఎక్కడంటే..?

  • February 7, 2023 / 12:47 PM IST

నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు.. తెలుగు చలనచిత్ర చరిత్రలో, దాదాపు 70 సంవత్సరాల సుదీర్ఘ నట జీవితంలో ఆయన పోషించని పాత్రలు, చేయని ప్రయోగాలు లేవు.. చివరి శ్వాస వరకూ నటిస్తూనే ఉండాలనే తన కోరికను తీర్చుకున్నారు అక్కినేని.. ‘మనం’ వంటి మెమరబులు మూవీని అక్కినేని కుటుంబానికి, అభిమానులకు, తెలుగు ప్రేక్షకులకు కానుకగా ఇచ్చి వెళ్లిపోయారు. అయితే ఇటీవల ఆయన నటించగా.. 40 ఏళ్లుగా విడుదలకు నోచుకోని ‘ప్రతిబింబాలు’ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. 2022 నవంబర్ 5న ఏపీ, తెలంగాణలో సెలెక్టెడ్ స్క్రీన్స్‌లో రిలీజ్ చేశారు.

తమ అభిమాన నటుడు యాక్ట్ చేసిన చిత్రం.. పైగా ఇన్నేళ్ల తర్వాత విడుదల కావడంతో ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడీ మూవీ 100 రోజుల వేడుక జరుపుకోబోతోంది. ఒక మహా నటుడు చేసిన సినిమా 4 దశాబ్దాల తర్వాత వచ్చి, ఇలాంటి అరుదైన ఘనత సాధించడం అనేది తెలుగు చలనచిత్ర చరిత్రలో జరుగుతున్న అద్భుతం అని చెప్పొచ్చు.. అక్కినేని, జయసుధ, తులసి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ ప్రేమకథా చిత్రంలో ఏఎన్నార్ ద్విపాత్రాభినయం చేశారు. గుమ్మడి, కాంతారావు, సాక్షి రంగారావు, అన్నపూర్ణ, జయమాలిని, అనురాధ తదితరులు కూడా నటించారు.

కె.యస్. ప్రకాశ రావు (దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు తండ్రి) దర్శకత్వంలో.. విష్ణు ప్రియ సినీ కంబైన్స్ బ్యానర్ మీద జాగర్లమూడి రాధకృష్ణ నిర్మించారు.. దర్శకుడిగా సింగీతం శ్రీనివాస రావు పేరు ఎందుకు వేశారంటే.. ‘ప్రతిబింబాలు’ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన మరణించారు. దీంతో సింగీతం చిత్రాన్ని పూర్తి చేశారు. నిర్మాత రాధకృష్ణ అప్పటికే ‘వియ్యాలవారి కయ్యాలు, ’కోడళ్లు వస్తున్నారు జాగ్రత్త’, ‘కోరుకున్న మొగుడు’ లాంటి చిత్రాలు చేశారు. షూటింగ్ జరిగిన తర్వాత సీన్లు మార్చడం,

ఆర్టిస్టుల డేట్స్, ఆర్థిక, న్యాయపరమైన సమస్యలన్నీ సినిమాను చుట్టుముట్టాయి.. అక్కినేని కూడా సినిమాను విడుదల చేయించడానికి చాలా ప్రయత్నాలు చేశారు కానీ వీలు పడలేదు..స్పెషల్ షోలు, రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తున్న ఈ టైంలో ‘ప్రతిబింబాలు’ సినిమాని రిలీజ్ చేయడానికి నిర్మాత కొద్దికాలంగా ప్రయత్నిస్తున్నారు. ట్రెండ్ ఫాలో అవాలని కాదు కానీ ఎలాగైనా ప్రేక్షకాభిమానులకు సినిమా చూపించాలనేది ఆయన కోరిక. డీఐ, డీటీఎస్ లాంటి టెక్నాలజీ డిజిటల్‌లోకి మార్చి..

తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలోనూ 225 కేంద్రాల్లో విడుదల చేయగా మంచి స్పందన లభించింది.. ఫిబ్రవరి 16న చిత్తూరు జిల్లాలోని అరకొండలో గల కృష్ణా టాకీస్‌లో 100 రోజుల వేడుకు జరుపనున్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అక్కినేని అభిమానులు హాజరై విజయవంతం చేయాలంటూ ఫ్యాన్స్ సామాజిక మాధ్యమాలలో సందడి చేస్తున్నారు.. అలాగే అక్కినేని ఈ అరుదైన రికార్డ్ గురించి తెలిసుంటే ఆనందించేవారంటూ భావోద్వేగానికి గురవుతున్నారు..

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus