‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కాబోతోంది. 11 సాయంత్రం నుండి ప్రీమియర్ షోలు పడనున్నాయి. అయితే ఈ సినిమా అప్పుడే సూపర్ హిట్ అయిపోయింది అంటూ చిరు(Chiranjeevi) స్టేట్మెంట్ ఇవ్వడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. నిన్న అంటే జనవరి 7న నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరు ఈ రకమైన కామెంట్స్ చేయడం జరిగింది.
ఆయన మాట్లాడుతూ.. “నేను చెప్పబోయేది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే.. మా సినిమా(మన శంకర వరప్రసాద్ గారు) ఆల్రెడీ సూపర్ హిట్ అయిపోయింది. ఏ రకంగా అంటే.. బడ్జెట్ పరంగా(విత్ ఇన్ ది లిమిట్స్), అనుకున్న టైంకి(చెప్పిన రోజుల్లోనే) సినిమా కంప్లీట్ చేశాడు దర్శకుడు అనిల్ రావిపూడి.చాలా అత్యద్భుతంగా తీయగలిగాడు అనిల్.
ఒక సినిమా సూపర్ హిట్ అయ్యింది అని ఎలా చెప్పగలం అంటే.. డైరెక్టర్ మొత్తం తన గ్రిప్లో ఉంచుకుని.. దాని బడ్జెట్ దాటనివ్వకుండా చెప్పిన టైంలో చేయగలిగితే ఆ సినిమాకి అది మొదటి సక్సెస్. ఎన్ని సినిమాలు ఇలా ఉన్నాయి అని చెప్పండి అంటే.. చాలా తక్కువగా మనం లెక్కపెట్టుకోవాల్సిన పరిస్థితి. ఆ రకంగా మా సినిమా మొదటి విజయం సాధించింది. రెండో విజయం జనవరి 12న సాధిస్తుంది” అంటూ చిరు చెప్పుకొచ్చారు.
చిరు చెప్పినదాంట్లో వాస్తవం లేకపోలేదు. ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాకి షూటింగ్ ఆరంభంలోనే తెలుగు ఫెడరేషన్ యూనియన్ సభ్యుల స్ట్రైక్ రూపంలో పెద్ద ఇబ్బంది ఎదురైంది.ఆల్మోస్ట్ నెల రోజుల పాటు షూటింగ్ డిలే అయ్యింది. 10 రోజులు షూటింగ్ డిలే అయితే రిలీజ్ డేట్ నెలలు వెనక్కి నెట్టేస్తున్న రోజులివి. అయినప్పటికీ చిరంజీవి వంటి పెద్ద హీరో సినిమా షూటింగ్ అనుకున్న టైంకి పూర్తిచేసి.. రిలీజ్ చేస్తున్నారు అంటే ఈరోజుల్లో అది పెద్ద విశేషమే కదా. అందుకే చిరు తమ సినిమా ఆ విషయంలో సూపర్ హిట్ ఫలితాన్ని అందుకుంది చెప్పడం జరిగింది.