Ananya Nagalla: అలాంటి అబ్బాయి కావాలని కోరుకుంటున్న అనన్య.. దొరుకుతాడా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ అయిన తెలుగమ్మాయిలు చాలా తక్కువమంది ఉన్నారు. అలా సక్సెస్ అయిన తెలుగమ్మాయిలలో అనన్య నాగాళ్ల (Ananya Nagalla) ఒకరు. ఇప్పటివరకు అనన్య నటించిన సినిమాల కమర్షియల్ రేంజ్ ఎలా ఉన్నా మంచి సినిమాలలో నటించారనే పేరును మాత్రం ఆమె సంపాదించుకున్నారు. గ్లామర్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న అనన్య భవిష్యత్తులో గ్లామర్ రోల్స్ లో నటించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. తంత్ర (Tantra) సినిమాతో బిలో యావరేజ్ మూవీని ఖాతాలో వేసుకున్న అనన్య నాగళ్ల ఒక ఇంటర్వ్యూలో తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పుకొచ్చారు.

హాయ్ నాన్న (Hi Nanna) సినిమాలో నాని (Nani) పాత్ర లాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని అనన్య వెల్లడించారు. రిలేషన్ షిప్ లో ఎప్పుడూ సంతోషంగా స్నేహితులలా ఉండాలని అనన్య నాగళ్ల కామెంట్లు చేయడం గమనార్హం. అనన్య నాగళ్లకు అలాంటి వ్యక్తి భర్తగా దొరుకుతాడో లేదో చూడాల్సి ఉంది. ఒకప్పుడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ప్రముఖ కంపెనీలో పని చేసిన ఈ బ్యూటీ సినిమాలపై ఉన్న ఇష్టంతో ఉద్యోగానికి గుడ్ బై చెప్పి హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

పెళ్లి ఎప్పుడన్నది కాలమే నిర్ణయిస్తుందని ఆమె పేర్కొన్నారు. పెళ్లి చేసుకున్నా ఇండస్ట్రీ వారిని చేసుకోనని అనన్య వెల్లడించారు. అనన్య నాగళ్ల త్వరలో మరిన్ని కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది. అనన్య నాగళ్ల ఇతర భాషలపై దృష్టి పెడితే ఆమె కెరీర్ మరింత పుంజుకుంటుందని చెప్పవచ్చు.

రెమ్యునరేషన్ విషయంలో అనన్య మరీ భారీ స్థాయిలో డిమాండ్ అయితే చేయడం లేదని సమాచారం అందుతోంది. అనన్య భవిష్యత్తు ప్రాజెక్ట్ లు సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అనన్య నాగళ్లకు ఇన్ స్టాగ్రామ్ లో 15 లక్షల ఫాలోవర్లు ఉన్నారు. కథల ఎంపికలో అనన్య మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

సైలెంట్ గా పెళ్లి పీటలెక్కిన ‘బిగిల్’ నటి ఇంద్రజ..!

కర్ణాటకలో సినిమాలు బ్యాన్‌ అంటున్నారు… మన దగ్గరా అదే చేస్తారా?
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus