అనన్య నాగళ్ళ (Ananya Nagalla) .. పరిచయం అవసరం లేని పేరు. ‘మల్లేశం’ తో (Mallesham) హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమె.. ఆ తర్వాత ‘ప్లే బ్యాక్’ అనే సినిమాలో కూడా తన నటనతో మెప్పించింది. దీంతో పవన్ కళ్యాణ్ సినిమాలో ఈమెకు ఛాన్స్ లభించింది. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమాలో ఛాన్స్ కొట్టడం వల్ల ఈమె దశ తిరిగింది అని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే..ఆ సినిమాలో అనన్య కంటే నివేదా థామస్ (Nivetha Thomas), అంజలి (Anjali )..ల రోల్స్ కి వెయిటేజీ ఎక్కువగా ఉండటం వల్ల.. అనన్యకి పెద్దగా అప్రిసియేషన్ ఏమీ రాలేదు.
కానీ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించిన నటిగా.. ఈమెకు వరుసగా ఛాన్సులు వచ్చాయి. వచ్చిన ప్రతి ఆఫర్ ను ఏమీ ఓకే చేసేసింది. ‘మాస్ట్రో’ (Maestro) ‘ఊర్వశివో రాక్షసివో’ (Urvashivo Rakshasivo) ‘శాకుంతలం’ (Shaakuntalam) ‘మళ్ళీ పెళ్లి’ (Malli Pelli) ‘అన్వేషి’ (Anveshi) వంటి సినిమాల్లో పెద్దగా స్క్రీన్ స్పేస్ లేని పాత్రలు చేసి తన గ్రోత్ ను ఆమె పడగొట్టుకున్నట్టు అయ్యింది. ఈ విషయం వెంటనే గ్రహించి ‘తంత్ర’ (Tantra) ‘పొట్టేల్'(Pottel) వంటి సినిమాల్లో మంచి పాత్రలు పట్టినా.. అవి బాక్సాఫీస్ వద్ద నిలబడకపోవడం వల్ల అనన్యకి ప్లస్ కాలేదు.
ఇప్పుడైతే టాలీవుడ్లో అనన్య హవా ముగిసినట్టే. ఏవైనా స్పెషల్ రోల్స్ వంటి వాటితో టైం పాస్ చేయాలి తప్ప.. పెద్ద ఆఫర్లు అయితే వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఇలాంటి టైంలో ఆమెకు ఓ బాలీవుడ్ ఛాన్స్ వరించినట్టు ఇండస్ట్రీ టాక్. దీంతో బాలీవుడ్లో ఏమైనా తన పేరు మార్మోగాలి అనుకుందో.. ఏమో కానీ, మునుపెన్నడూ లేని విధంగా ఏమీ క్లీవేజ్ షోలతో ఓ ఫోటో షూట్ చేసింది.
ఆ పిక్స్ చూసి అంతా షాక్ అవుతున్నారు. ఇలాంటి ఫోటో షూట్లు కెరీర్ ప్రారంభంలో చేస్తే.. ‘కొంచెం బెటర్ రోల్స్ వచ్చేవి కదా? ఇప్పుడు చేసి ఉపయోగం ఏంటి?’ అంటూ అసలు విషయం తెలియని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. అలా వార్తల్లో నిలిచింది ఈ బ్యూటీ. ఆమె లేటెస్ట్ పిక్స్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :