అల్లు అర్జున్ (Allu Arjun) 22వ సినిమాని తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee Kumar) తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ‘సన్ పిక్చర్స్’ సంస్థపై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ఓ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్ అనగానే పక్కా మాస్ సినిమాని ఆడియన్స్ ఆశిస్తారు. కానీ ఇప్పుడు వీరిద్దరూ కలిసి లార్జర్ థెన్ లైఫ్ మూవీని చేస్తున్నారు.
అందుకే మొదటి నుండి ఆడియన్స్ ను ప్రిపేర్ చేయడానికి సినిమా జోనర్ ఎలా ఉండబోతుంది అనేది హింట్ ఇచ్చారు. తద్వారా ఆడియన్స్ ను ప్రిపేర్ చేసినట్టు అయ్యింది. ‘పుష్ప 2’ తో Pushpa 2) అల్లు అర్జున్, ‘జవాన్’ (Jawan) తో అట్లీ వెయ్యి కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యారు. దీంతో వీరి కలయికలో రాబోతున్న సినిమాపై మొదటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇదిలా ఉండగా… ఈ సినిమా కథ ప్రకారం అల్లు అర్జున్ మునుపెన్నడూ లేని విధంగా ట్రిపుల్ రోల్ ప్లే చేస్తున్నాడు.
కాబట్టి ఇందులో ముగ్గురు హీరోయిన్లు అవసరమట. అందుకే ఓ హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను (Janhvi Kapoor) , మరో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ ను (Mrunal Thakur) ఇప్పటికే ఫైనల్ చేశారు. ఇప్పుడు హీరోయిన్ కూడా ఫిక్స్ అయినట్లు సమాచారం. లేటెస్ట్ టాక్ ప్రకారం… ఈ సినిమాలో మూడో హీరోయిన్ గా అనన్య పాండే (Ananya Panday ) ఫిక్స్ అయ్యిందట. గతంలో ఈమె తెలుగులో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) సరసన ‘లైగర్’ లో (Liger) హీరోయిన్ గా నటించింది. కొంత గ్యాప్ తర్వాత మరో తెలుగు సినిమాలో ఈమె ఛాన్స్ కొట్టినట్టు తెలుస్తుంది.