మాల్దీవుల్లో పెళ్లిరోజు జరుపుకుంటున్న అనసూయ దంపతులు

“నన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటానని.. కంటికిరెప్పలా చూసుకుంటానని పదిహేడేళ్లక్రితం ఆ సూర్య భగవానిని సాక్షిగా మాట ఇచ్చావు. అలాగే ఎనిమిదేళ్ళక్రితం ఇదే రోజు నీ ప్రపంచమే నేనని.. నన్ను నీదాన్ని చేసుకున్నావు. ఇచ్చిన మాట ప్రకారం నాపై ప్రేమ కురిపిస్తున్నావు. నన్ను ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచుతున్నావు..”.. ఇదేదే సినిమాలో డైలాగ్ మాదిరిగా అనిపిస్తోంది కదూ.. కానీ ఇది సినిమా డైలాగ్ కాదు. ప్రముఖ యాంకర్, సినీ నటి అనసూయ తన పెళ్లిరోజున భర్త భరద్వాజ్ కి తన ఆనందాన్ని ఇలా చెప్పుకుంది. ఎనిమిదవ పెళ్లిరోజు సందర్భంగా భరద్వాజ్ అనసూయకి సర్ ప్రైజ్ ప్లాన్ చేశారు.

ఈ సారి మాల్దీవుల్లో విహరించేలా ఏర్పాట్లు చేశారు. అక్కడ భర్తతో కలిసి బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోని ట్విట్టర్లో షేర్ చేసింది. “ఎప్పట్లాగానే నా భర్త ఈ ఏడాది కూడా సర్ ప్రైజ్ ప్లాన్ చేశారు. ఈ ఏడాది మాల్దీవ్స్ కు వచ్చాము. ఇంతకంటే ఎక్కువ ప్రేమను పొందగలమా?, ఎంతో సంతోషంగా ఉంది” అంటూ ట్వీట్ చేసింది. రీసెంట్ గా అనసూయ రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా అదరగొట్టింది. తన అద్భుత నటనతో అభినందనలు అందుకుంది. అందంతోనే కాదు అభినయంతోను అలరించగలనని నిరూపించుకుంది. ప్రస్తుతం ఐదు సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus