సెలబ్రిటీలు సోషల్ మీడియా ఖాతాల ద్వారా తమ అభిమానులతో టచ్ లో ఉంటారు.మరికొంతమంది తమ సినిమా అప్డేట్ల కోసం సోషల్ మీడియాని ఎక్కువగా వాడతారు. కానీ అనసూయ సోషల్ మీడియాని వాడే విధానం వేరుగా ఉంటుంది. ఆమె మనసులో ఉన్న ఎమోషన్స్ అన్నిటినీ బోల్డ్ గా బయటపెడుతూ… సోషల్ మీడియాని ఓ వెపన్ లా వాడుతూ ఉంటుంది అనసూయ.
తాజాగా సోషల్ మీడియాతో ఓ యుద్ధమే చేసినట్లు తెలిపి మరింత షాకిచ్చింది అనసూయ. తన డ్రెస్సింగ్, పర్సనల్ లైఫ్ పై కామెంట్లు చేసే వాళ్లకు మైండ్ బ్లాక్ అయ్యేలా సమాధానం ఇచ్చింది. ఆమె లేటెస్ట్ స్టేట్మెంట్ ప్రకారం… అనసూయ ఏకంగా 30 లక్షల మందిని బ్లాక్ చేసినట్టు తెలిపి షాకిచ్చింది. ఆమె స్టేట్మెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
కొంతకాలంగా తనపై వస్తున్న ట్రోలింగ్‌ను లైట్ తీసుకున్న అనసూయ, కొందరు హద్దులు దాటి పర్సనల్ విషయాల్లోకి తలదూర్చడంతో సీరియస్ అయ్యింది. తనను టార్గెట్ చేస్తూ వీడియోలు చేస్తున్న వారికి గట్టిగానే ఇచ్చిపడేసింది. ఆమె వారిపై స్పందిస్తూ.. “నేను తల్లినే, కానీ నాకు ఇష్టం వచ్చినట్లు బట్టలేసుకుంటా, నా గ్లామర్ నా ఇష్టం.నా ఫ్యామిలీకి, నా పిల్లలకి లేని నొప్పి మీకెందుకు. పిల్లల ముందు తల్లి కాన్ఫిడెంట్‌గా ఉండటంలో తప్పేంటి.? నా ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నంత వరకు నేను ఎవరినీ లెక్క చేయను. ధైర్యంగా ఉండటం అనేది అగౌరవంగా ప్రవర్తించడం కాదు. నచ్చిన దుస్తులు ధరించినంత మాత్రాన విలువలు కోల్పోయినట్లు కాదు.ఎవరి బతుకు వాళ్లది, నా స్టైల్ నాది. ఒకరి లైఫ్‌లోకి మరొకరు వేలు పెట్టొద్దు. నన్ను చాలా రకాలుగా విమర్శించారు. ఊరుకున్నాను. ఇకపై ఊరుకునేది లేదు” అంటూ స్పష్టంచేసింది అనసూయ