రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ ‘కింగ్డమ్’. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సత్య దేవ్ కీలక పాత్ర పోషించారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై నాగవంశీ దాదాపు రూ.130 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్లో వచ్చిన గ్లింప్స్, అనిరుధ్ సంగీతంలో రూపొందిన ‘హృదయం లోపల’ ‘అన్న అంటేనే’ ‘రగిలే రగిలే’ వంటి పాటలు కూడా ప్రజాదరణ పొందాయి.
ఇక టీజర్, ట్రైలర్ అయితే సినిమాపై ఉన్న అంచనాలు డబుల్ చేశాయనే చెప్పాలి. జూలై 31న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. జూలై 30నే ప్రీమియర్ షోలకు చిత్ర బృందం ప్లాన్ చేసింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఆల్రెడీ కొన్ని చోట్ల షోలు పడ్డాయి. సినిమా చూసిన వారు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకుంటున్నారు.
వారి టాక్ ప్రకారం.. విజయ్ దేవరకొండ ఎంట్రీ సీక్వెన్స్ బాగుందట. ఫైట్ సీక్వెన్స్ లు.. ఇంటర్వెల్ బ్లాక్ హైలెట్ అంటున్నారు. సత్యదేవ్, విజయ్ దేవరకొండ..ల కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు కూడా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే విధంగా ఉన్నాయట. క్లైమాక్స్ బాగా డిజైన్ చేసినట్లు చెబుతున్నారు. సెకండ్ పార్ట్ కి ఇచ్చిన లీడ్ కూడా బాగుందట. గిరీష్ గంగాధరన్,జోమోన్ టి జాన్ సినిమాటోగ్రఫీ చాలా బాగుందట. ప్రతి ఫ్రేమ్ రిచ్ గా ఉందంటున్నారు. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గూజ్ బంప్స్ తెప్పించే విధంగా ఉందంటున్నారు. చూడాలి మరి మార్నింగ్ షోలు ముగిశాక ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో.
విజయ్ దేవరకొండ ఊపిరి పీల్చుకున్నట్టేనా..!?