Anasuya: సేవ చేయాలంటే రాజకీయాలలోకి రావాలా: అనసూయ

జబర్దస్త్ యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వెండితెర అవకాశాలను అందుకొని కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. పెదకాపు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి అనసూయ త్వరలోనే రజాకార్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. రజాకార్ సినిమా నిజాం కాలంలో రజాకార్ల ఆగడాలను ఇతివృత్తంగా చేసుకొని రూపొందించుకుంది.

ఇందులో ఒక ముఖ్య పాత్రలో అనసూయ నటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి తాజాగా భారతి భారతి ఉయ్యాలో అనే పాటను విడుదల చేశారు. ఈ క్రమంలోని చిత్ర బృందం ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా విలేకరులు అనసూయను ఎన్నో రకాల ప్రశ్నలు వేస్తూ ఆమె నుంచి సమాధానాలు రాబట్టారు. ఈ క్రమంలోనే పొలిటికల్ ఎంట్రీ గురించి కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి.

అనసూయ (Anasuya) రాజకీయాలలోకి రాబోతుంది అంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అనసూయ పొలిటికల్ ఎంట్రీ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలపై తాజాగా ఈమెను ప్రశ్నించగా తనకు రాజకీయాలలోకి రావాలన్న ఆలోచన కూడా లేదని తెలిపారు. తాను ఎవరితోనో పొలిటికల్ ఎంట్రీకి సంబంధించినటువంటి చర్చలు కూడా జరపలేదని తెలిపారు. రాజకీయాలపై ఏమాత్రం ఆసక్తి లేదని సేవ చేయాలి అంటే రాజకీయాలలోకే రావాల్సిన అవసరం లేదని ఈమె తెలిపారు.

నటిగా కూడా తాను ఇతరులకు సహాయం చేయవచ్చని, నాకున్న దాంట్లో కొంత మొత్తంలో ఇతరులకు సేవ చేసే పనిలోనే తాను ఉన్నానని ఈ సందర్భంగా అనసూయ పొలిటికల్ ఎంట్రీ గురించి మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus