Anasuya: కన్నీళ్లకు అసలు రీజన్ చెప్పేసిన అనసూయ.. అలా జరిగిందంటూ?

  • September 22, 2023 / 12:04 PM IST

బుల్లితెర యాంకర్ అనసూయ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొన్నిరోజుల క్రితం అనసూయ ఏడుస్తూ ఒక వీడియో చేయగా ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. పెదకాపు సినిమాలో కీలక పాత్రలో నటించిన అనసూయ ఆ వీడియో గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి. తనకు పక్షులంటే చాలా ఇష్టమని ఆమె తెలిపారు. పది సంవత్సరాలుగా చిలుకల లాంటి పక్షులను తాను పెంచుకున్నానని ఎంతో కేరింగ్ గా వాటిని చూసుకున్నానని ఆమె అన్నారు.

అయితే అనసూయ కుటుంబ సభ్యులను ఆ పక్షులు కొరికేవని సమాచారం. అలా కొరకడం వల్ల వాళ్లకు అయిన గాయాలు తగ్గడానికి చాలా సమయం పట్టేదట. కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఆ పక్షులను వేరే వాళ్లకు ఇవ్వాల్సి రావడంతో తాను ఎంతగానో బాధ పడ్డానని అనసూయ కామెంట్లు చేశారు. పక్షులను ఇచ్చిన సమయంలో అనసూయ బిడ్డను కోల్పోయిన తల్లిలా బాధపడ్డారని సమాచారం. పక్షులపై ఉండే ప్రేమ వల్ల ఏడ్చానే తప్ప అంతకు మించి మరే కారణం లేదని ఆమె చెప్పుకొచ్చారు.

రంగస్థలం సినిమాలోని రంగమ్మత్త పాత్ర ద్వారా నన్ను అందరూ గుర్తు పెట్టుకున్నారని అనసూయ వెల్లడించారు. విభిన్నమైన రోల్స్ చేయడానికి నా వంతుగా నేను ప్రయత్నిస్తున్నానని అనసూయ కామెంట్లు చేశారు. పెదకాపు మూవీలోని రోల్ వైవిధ్యంగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. సిల్వర్ స్క్రీన్ వరకు అన్ని రకాల పాత్రలు చేయాలని ఉందని అనసూయ వెల్లడించారు. కథ డిమాండ్ చేస్తే అమ్మమ్మ రోల్స్ లో నటించడానికి సిద్ధమని అనసూయ (Anasuya) తెలిపారు.

అయితే ఆ రోల్ చూసిన తర్వాత అందరూ ఆ పాత్ర గురించి మాట్లాడుకోవాలని అనసూయ చెప్పుకొచ్చారు. అనసూయ రెమ్యునరేషన్ భారీ రేంజ్ లో ఉందని తెలుస్తోంది. అనసూయ వరుసగా విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. ప్రస్తుతం అనసూయ బుల్లితెర షోలకు దూరంగా ఉన్నారనే సంగతి తెలిసిందే.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus