మెగా హీరోతో అనసూయ ఆట..పాట

  • October 26, 2016 / 09:42 AM IST

బుల్లితెర యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన అనసూయ వెండితెరపైనా మెరిసిన సంగతి తెలిసిందే. నాగార్జున నటించిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాలో చిన్న పాత్రతోపాటు ఓ పాటలో చిందులేసి ప్రేక్షక లోకాన్ని మురిపించింది. గ్లామర్ కే పరిమితమవకుండా ‘క్షణం’ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గాను మెప్పించింది. అయితే ఇప్పుడు అనసూయ ఐటెం గర్ల్ గా మారుతుందట. అదీ ఓ మెగా హీరో కోసం.

సాయి ధరమ్ తేజ్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘విన్నర్’ సినిమా రూపొందుతుంది. ఠాగూర్ మధు, నల్లమలుపు శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలోని ఓ ప్రత్యేక గీతం ఉందట. దీనికోసం చిత్ర బృందం అనసూయను సంప్రదించారన్నది ఫిల్మ్ నగర్ టాక్. గతంలో ఇలాంటి అవకాశాలు వచ్చినా “ఆసక్తిలేదంటూ” చెప్పుకొచ్చిన ఈ సినిమాలో సాయితో ఆడిపాడేందుకు సిద్ధమయ్యిందట. దీనిపై అధికారిక కబురొస్తుందేమో చూడాలి. శివరాత్రి సందర్బంగా ఈ సినిమాని 2017 ఫిబ్రవరి 24న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus