Anasuya: అనసూయను పెద్దకొడుకు అంత మాట అన్నాడా..?

బుల్లితెరపై స్టార్ యాంకర్ గా అనసూయ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఒకవైపు జబర్దస్త్ షోతో బిజీగా ఉంటూనే గుర్తింపు తెచ్చిపెట్టే పాత్రలకు అనసూయ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అయితే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా, టీవీ రంగాలలో కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి ఎదుర్కొన్న ఎన్నో ఇబ్బందుల గురించి అనసూయ చెప్పుకొచ్చారు. తనకు ఒకానొక సమయంలో సినిమా ఆఫర్లు వచ్చినట్టే వచ్చి చేజారిపోయాయని అనసూయ అన్నారు. ఆ సమయంలో ఎంతో మనోవేదనకు గురయ్యానని అనసూయ చెప్పుకొచ్చారు.

తాను ధరించే దుస్తుల విషయంలో కూడా కొన్నిసార్లు నెగిటివ్ కామెంట్లు వినిపించాయని అనసూయ తెలిపారు. తన పెద్ద కొడుకు సైతం పొడవైన దుస్తులు ధరించాలని తనకు సూచనలు చేశాడని అనసూయ వెల్లడించారు. సినిమా, టీవీ రంగాల్లో కెరీర్ ను మొదలుపెట్టినప్పటి నుంచి ఎన్నోసార్లు కన్నీళ్లు పెట్టుకున్నానని అనసూయ అన్నారు. ఒకసారి తనకు మూడు సినిమాలలో ఆఫర్లు వచ్చాయని అయితే ఏం జరిగిందో తెలీదు కానీ ఆ అవకాశాలన్నీ చేజారిపోయాయని ఆ సమయంలో భర్త దగ్గర కూర్చుని ఏడ్చేసేదానినని అనసూయ అన్నారు.

డిగ్రీ వరకు ఏ బట్టలు వేసుకోవాలో అమ్మే ఇచ్చేదని అలా పెరగడం వల్లే తనలో చిత్తశుద్ధి ఇంకా ఉందని అనసూయ తెలిపారు. రిలేషన్స్ కు, ఫ్యామిలీకి తాను చాలా రెస్పెక్ట్ ఇస్తానని అనసూయ పేర్కొన్నారు. శరీరం దేవాలయం లాంటిదని తాను గట్టిగా నమ్ముతానని తనకు కంఫర్ట్ అయిన దుస్తులనే తాను వేసుకుంటానని అనసూయ వెల్లడించారు.

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus