అందుకే ఆ హీరో.. అనసూయని కొట్టాడంట..!

తాజాగా హాట్ యాంకర్ అనసూయ పై ఓ హీరో చేయిజేసుకున్నాడు. అనసూయ ‘రాంగ్ ఇన్ఫర్మేషన్’ ఇవ్వడంతో అందరూ చూస్తుండగానే… ఆ హీరో వచ్చి అనసూయ చెంప చెళ్ళుమనిపించాడు. అంత క్రేజ్ ఉన్న నటిని పట్టుకుని అందరి ముందు అలా కొడితే… అందరూ చూస్తుండిపోయారా…? అసలు అనసూయ పై చెయ్యి చేసుకోవడమేంటి… అని కంగారు పడకండి.! ఇదంతా షూటింగ్లో ఓ భాగం మాత్రమే. అనసూయ నటిస్తున్న తాజా చిత్రం ‘కథనం’ చిత్ర షూటింగ్ సమయంలో సీన్ చిత్రీకరించారు.

ఈ సీన్లో పోలీస్ ఆఫీసర్ అయిన ఓ హీరో.. అనసూయ చెప్పిన ఓ ఇన్ఫర్మేషన్ ని సరిగ్గా వినకుండా… మిస్ గైడ్ అవుతాడు. దీంతో అనసూయ కావాలనే ఇలా చేసిందనుకుని వచ్చి… జీప్ దిగిన వెంటనే అనసూయ చెంప పై కొడతాడు. ఈ సీన్ లో దనరాజ్ కూడా పాల్గొన్నాడు. . గత 6 రోజుల నుండీ.. ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. రాజేశ్‌ నాదెండ్ల డైరెక్షన్లో ఈ చిత్రం తెరకెక్కింది. అవసరాల శ్రీనివాస్‌, రణధీర్‌, ధన్‌రాజ్‌, ‘వెన్నెల’ కిశోర్‌ ముఖ్య పత్రాలు చేసారు. ‘ది మంత్ర ఎంటర్‌టైన్‌మెంట్స్‌’, ‘ది గాయత్రి ఫిల్మ్స్‌’ బ్యానర్ల పై బి. నరేంద్రరెడ్డి, శర్మ చుక్కా కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ చిత్రం కచ్చితంగా తనకి మంచి పేరు తీసుకొస్తుందని అనసూయ భావిస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus