అనసూయ భరద్వాజ్.. పరిచయం అవసరం లేని పేరు. స్మాల్ స్క్రీన్ టు బిగ్ స్క్రీన్ కి దూసుకొచ్చిన ఈ అమ్మడు.. సోషల్ మీడియాలో మాత్రం ఓ స్పెషల్ అట్రాక్షన్ ను సంపాదించుకుంది. అనసూయ సోషల్ మీడియాని వాడే విధానం వేరుగా ఉంటుంది. ఒక వెపన్ గా వాడుతూ ఉంటుంది అని చెప్పాలి. తన కొత్త సినిమాల అప్డేట్లు వంటివి మాత్రమే కాకుండా.. గ్లామర్ ఫోటోలు షేర్ చేసుకోవడానికి.. వాటికి నెగిటివ్ కామెంట్స్ వస్తే.. నెటిజన్లకు ఘాటుగా కౌంటర్లు వేయడానికి అనసూయ సోషల్ మీడియాని వాడుతూ ఉంటుంది అని అంతా భావిస్తారు.
అన్నీ ఎలా ఉన్నా సోషల్ మీడియాలో అనసూయ షేర్ చేసే గ్లామర్ ఫోటోలు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. హీరోయిన్లకు సైతం పోటీ ఇచ్చే విధంగా అనసూయ గ్లామర్ ఫోటోలు ఉంటాయని చెప్పాలి. తాజాగా ఆమె కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటో షూట్ చాలా ట్రెండీగా ఉంది అని చెప్పాలి. ‘వాళ్ళు పవర్ డ్రెస్సింగ్ కావాలని అన్నారు.. నాకు శారీ కరెక్ట్ అన్నట్టు అనిపించింది’ అనే క్యాప్షన్ తో అనసూయ ఈ ఫోటోలు షేర్ చేసింది.
అనసూయ డ్రెస్సింగ్ ను గమనిస్తే.. శారీనే డిఫరెంట్ గా ధరించింది అని చెప్పాలి. ఆ క్రెడిట్ అంతా స్టైలింగ్ పర్సన్ కి దక్కుతుంది. ముఖ్యంగా బ్లౌజ్ కొత్తగా ఉంది. ఆమె మెడలో ధరించిన ఆర్నమెంట్ సైతం కొత్తగా అనిపిస్తుంది. ఇక అనసూయ గ్లామర్ ఫోజులు వింతగా, కొత్తగా ఉన్నాయి. ఇక లేట్ చేయకుండా అనసూయ లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి