అనసూయ (Anasuya Bhardhwaj) సోషల్ మీడియాని ఓ వెపన్ మాదిరి వాడుతూ ఉంటుంది. అక్కడ మాత్రం ఈమె ఫైర్ బ్రాండ్..లా వ్యవహరిస్తూ ఉంటుంది. వాంటెండ్ గానో… లేక అన్ వాంటెడ్ గానో తెలీదు కానీ.. అనసూయ ఏదో ఒక కాంట్రోవర్సీలో ఉంటూనే ఉంటుంది. ముఖ్యంగా అనసూయ- విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ..ల వ్యవహారం ఈనాటిది అయితే కాదు. ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) సినిమాలోని ఓ డైలాగ్ గురించి అనసూయ చేసిన కామెంట్స్ అప్పట్లో వివాదాస్పదమయ్యాయి. అందువల్ల అనసూయని విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఘోరంగా ట్రోల్ చేస్తూ ఉంటారు.
అయితే ఈ వివాదాలకు ఆమె ఫుల్ స్టాప్ పెట్టేసినట్టు గతేడాది ‘విమానం’ ప్రమోషన్స్ లో తెలిపింది. ఆ తర్వాత ఆమె నటించిన ఓ సినిమాలో విజయ్ దేవరకొండ ప్రస్తావన తీసుకురావడం జరిగింది. అయితే అది పెద్ద నెగిటివ్ గా ఏమీ ఉండదు. సరే అంతా బాగానే ఉంది కదా.. ఇక ప్రాబ్లమ్ ఏమీ ఉండదు అనుకుంటే.. తాజాగా ఆమె ఓ ట్వీట్ వేసి హాట్ టాపిక్ అయ్యింది. అందులో ‘దూరపు కొండలు నునుపు’ అని పేర్కొంది అనసూయ.
ఇది ఆమె విజయ్ దేవరకొండ గురించే వేసి ఉండొచ్చు అని అంతా అనుకుంటున్నారు. ఎందుకలా అంటే.. నిన్న ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అక్కడ ‘రష్మిక (Rashmika Mandanna) స్పీచ్ కొంచెం విజయ్ దేవరకొండ స్టైల్లో ఉంది’ అనే కామెంట్స్ వినిపించాయి. మొన్నటికి మొన్న చెన్నై ఈవెంట్లో ఆమె విజయ్ దేవరకొండతో డేటింగ్లో ఉన్నట్టు పరోక్షంగా క్లారిటీ ఇచ్చింది. ‘బహుశా అందుకే అనసూయకి రష్మిక పై కోపం వచ్చి ఇలా ట్వీట్ చేసి ఉంటుంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు..
అయితే ‘ఆమె ట్వీట్ విజయ్ దేవరకొండ గురించి కాదు’ అని, దేవి శ్రీ ప్రసాద్ గురించి అని ఇంకొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే నిన్నటి ఈవెంట్లో రాజమౌళి (S. S. Rajamouli) .. దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) గురించి గొప్పగా మాట్లాడుతున్నప్పుడు… దేవి పక్కనే కూర్చున్న అనసూయ అతన్ని డిస్టర్బ్ చేస్తుంది. ఈ క్రమంలో దేవి ఒక్కసారిగా కోప్పడి తర్వాత రాజమౌళి మాట్లాడుతున్న వైపు చూశాడు. ఈ కారణంతోనే అనసూయ.. దేవిపై కోపంతో అలా ట్వీట్ చేసి ఉండొచ్చని అంతా అభిప్రాయపడుతున్నారు.
దూరపు కొండలు నునుపు .
— Anasuya Bharadwaj (@anusuyakhasba) December 3, 2024