రీసెంట్ గా జరిగిన ఒక సినిమా ఈవెంట్ లో యాక్టర్ శివాజీ ఆడవారి వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఆ వ్యాఖ్యలపై సినీ ప్రముఖుల నుంచి తీవ్ర అభ్యంతరం రావడం, కొందరు అయితే డైరెక్ట్ గా శివాజీని టార్గెట్ చేయటం కూడా జరిగింది. అలా ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ రాష్ట్ర మహిళా కమిషన్ శివాజీ ని స్వయంగా హాజరు అయ్యి, వివరణ ఇచ్చుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేయటంతో, శివాజీ స్వయంగా రాష్ట్ర మహిళా కమిషన్ ముందు హాజరు అయ్యి తన వివరణ ఇచ్చుకోవటం జరిగింది. ఇది ఇలా ఉండగా, యాంకర్ అనసూయ తీవ్రంగా స్పందించటం జరిగిన సంగతి అందరికి తెలిసిన విషయమే.
మరొక వైపు ప్రజల నుంచి శివాజీ కి అదే విధంగా మద్దతు కూడా లభించటం జరిగింది. రీసెంట్ గా అనసూయ ఆన్లైన్ లో అభిమానులతో తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఇంటరాక్ట్ అవ్వగా, “శివాజీ చెప్పింది కరెక్టే.. కానీ ఆయన మాటల్లో రెండు అసభ్య పదాలు దొర్లాయి” అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, దానికి అనసూయ రియాక్ట్ అవుతూ మహిళల భద్రత గురించి శివాజీ మంచి ఉద్దేశంతోనే చెప్పినా కూడా అబ్బాయిలు, అమ్మాయిలను తమకు నచ్చినట్లు ఉండనివ్వండి.
ఆపదలో ఉన్నప్పుడు వారికి మనం రక్షణగా నిలబడదాం అని సరళమైన భాషలో చెప్పి ఉంటే ఇంకా బాగుండేది అంటూ చెప్పుకొచ్చారు. దీనిపై నెటిజెన్లు ఒక రెండు పదాలు తప్పుగా మాట్లాడాడు దానిని ఎవరు సమర్ధించరు, ఇలాంటి సున్నితమైన అంశాలు గురించి మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడాలని చర్చించుకుంటున్నారు.