Toxic Teaser: ‘టాక్సిక్’ టీజర్ రివ్యూ.. ‘మార్కో’ ని తలపించిందిగా..!

‘కె.జి.ఎఫ్’ తో యష్ మార్కెట్ 10 రెట్లు పెరిగింది. అందుకే అతను గ్యాప్ తీసుకుని ‘టాక్సిక్'(Toxic) అనే పాన్ ఇండియా సినిమా చేశాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి ఓ గ్లిమ్ప్స్ వచ్చింది. కానీ అది ఆకట్టుకోలేదు. ఈరోజు అనగా జనవరి 8న యష్ పుట్టినరోజు కావడంతో.. ఈ సినిమాలో అతను పోషిస్తున్న రాయ పాత్రకి సంబంధించి ఒక టీజర్ ను వదిలారు.

Toxic Teaser

ఈ టీజర్ విషయానికి వస్తే.. ఇది 2 నిమిషాల 51 సెకన్ల నిడివి కలిగి ఉంది. స్మశాన వాటికలో ఓ శవానికి అంత్యక్రియలు చేస్తున్న ఫ్యామిలీని.. కొంతమంది క్రిమినల్స్ అటాక్ చేసి వారిని చిత్ర హింసలు పెట్టడం.. మరోవైపు ఓ కారు స్పీడ్ గా వచ్చి చెట్టుని గుద్దుకోవడం.. ఆ వెంటనే కార్ లో ఉన్న ఓ వ్యక్తి బయటకు వచ్చి ల్యాండ్ మైన్ పెట్టడం.. ఇక కార్ లో హీరో ఓ అమ్మాయితో సేదతీరడం.. అటు తర్వాత బాంబ్ పేలిపోయి.. ఆ క్రిమినల్ గ్యాంగ్ దారుణంగా మృతి చెందడం.. మిగిలిన వారిని హీరో బయటకి వచ్చి గన్ తో కాల్చి చంపడం.. చివర్లో ‘డాడీస్ హోమ్’ అంటూ పలకడం టీజర్లో ఉంది.

ఈ సినిమాలో కూడా హీరో యష్ రూత్ లెస్ గా, నిజంగానే టాక్సిక్ గా కనిపిస్తున్నాడు. కె.జి.ఎఫ్ సినిమాతో పోలిస్తే.. ఈ సినిమాకి కొంచెం స్లిమ్ అయ్యాడు. అతని మేకోవర్ బాగుంది. సినిమాటోగ్రఫీ హాలీవుడ్ సినిమాలను తలపించింది. మొత్తానికి టీజర్ ఓకే అనిపించే విధంగా ఉంది. మార్చి 19నే ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు కూడా టీజర్ తో కన్ఫర్మ్ చేశారు. మీరు కూడా ఓ లుక్కేయండి :

కానిస్టేబుల్ కనకం సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus