సంపూకి అనసూయ సపోర్ట్ ఎందుకంటే ?

హృదయ కాలేయం ద్వారా కడుపుబ్బా నవ్వించిన హాస్య నటుడు సంపూర్ణేష్ బాబుకు గ్లామర్ యాంకర్ అనసూయ సపోర్టుగా నిలిచింది. కళాకారుడికి తోటి కళాకారిణిగా మద్ధతు పలికింది. వివరాల్లోకి వెళితే.. అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆట) ఆర్గనైజర్ శ్రీ రాజ్ చేనుపాటి నుంచి సంపూకి చేదు అనుభవం ఎదురైంది. ఇద్దరి మధ్య ఏమి జరిగిందో తెలియదు గాని తనని శ్రీ రాజ్ బూతులు తిట్టాడని సంపూ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వెళ్లగక్కారు.

“ఇవాళ నా జీవితంలో చాలా గొప్ప రోజు. చాలా రోజుల తర్వాత ఆట ఆర్గనైజర్ తో “అమ్మ.. అక్క.. ఆలీ” అని బూతులు తిట్టించుకున్నాను. మా టీమ్ లో మరికొంత మందిని కూడా అతను ఇలాగే తిట్టారని విన్నాను. దీని వల్ల నేను, నా బృందం ఆట వేడుకలకు హాజరు కావడం లేదు. అమెరికాలో మా మంచి కోరే వారిని మిస్ అవుతున్నాం అని పోస్ట్ చేశారు. “మంచి పేరున్న సంస్థలకు ఆర్గనైజర్ గా ఉన్న వారు మమ్మల్ని కళాకారులుగా ట్రీట్ చేయండి. యాచకులు, వ్యభిచారులుగా కాదు” అని ఘాటుగా విమర్శించారు. అంతే కాకుండా “ఆట నిర్వాహకులపై నాకు మంచి అభిప్రాయం ఉంది. వచ్చే ఏడాది కలుస్తామని భావిస్తున్నా. కానీ కాళాకారులను ఆహ్వానించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి” అని సలహా ఇచ్చారు. ఇదే విషయాన్ని తన ట్విట్టర్ అకౌంట్ లో కూడా సంపూ పోస్ట్ చేసాడు.

సంపూర్ణేష్ ట్వీట్లకు యాంకర్ అనసూయ “మీ మాటలకు నేను ఏకీభవిస్తున్నాను. మధ్యవర్తుల వలనే కళాకారులకు అవమానాలు జరుగుతుంటాయి” అని రీ ట్వీట్ చేసింది. ఆమెతో పాటు అభిమానులు పెద్ద ఎత్తున మద్దతు పలకడంతో ఆట నిర్వాహకులు స్పందించారు. ఇలాంటి సంఘటనలు మరో సారి జరగవని ప్రామిస్ చేయడంతో సంపూ “ఆట” పై తన ట్వీట్లను, పోస్ట్ లను డిలీట్ చేసారు. వివాదం ముగియడంతో సంపూ తనకు అండగా నిలిచిన మీడియా, యాంకర్ అనసూయ, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus