బన్నీ సినిమాలో అనసూయ లేదంట..!
- March 17, 2016 / 10:27 AM ISTByFilmy Focus
‘జబర్దస్త్’ షోతో హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న అనసూయ తన టీవీ షోలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. రీసెంట్ గా యాంకర్ నుంచి యాక్టర్ అయిన అనసూయకు సినిమాల్లో అవకాశాలు వస్తూనే ఉన్నాయి. నాగ్ సరసన ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమాలో నటించి ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గరయ్యింది. అలానే ‘క్షణం’ సినిమాలో పోలీస్ పాత్రలో నటించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. దీంతో అనసూయకు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయన్న వార్తలు కోకొల్లలుగా వస్తున్నాయి.
ఇందులో భాగంగానే అనసూయ బన్నీ సినిమాలో చేయబోతోందన్న వార్త బాగా హల్‌చల్ చేస్తోంది. అయితే తననెవరూ ఈ సినిమా కోసం సంప్రదించలేదని అనసూయ కుండబద్దలు కొట్టేసింది. ఎందుకు ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారో నాకు అర్థం కావడం లేదని అంటోంది. అల్లు అర్జున్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపిస్తుందనుకున్న అనసూయ ఇలా ఒక్కసారిగా నటించట్లేదని చెప్పడంతో అనసూయ అభిమానులు నిరాశ చెందినట్లు తెలుస్తోంది..!
















