రోజా పై అనసూయ సెటైర్ లు.. వైరల్..!

  • January 18, 2020 / 03:17 PM IST

బుల్లితెర టి.ఆర్.పి ని ఓ ఊపు ఊపేసిన కామెడీ షో ‘జబర్దస్త్’. యూట్యూబ్ లో కూడా ఈ షో మిలియన్ ల వ్యూస్ ను రాబడుతోన్న సంగతి కూడా తెలిసిందే. ఈ షో వల్ల చాలా మంది లైఫ్ లు సెట్ అయ్యాయి. సినిమాల్లో వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ఇక ఈ షోలో స్కిట్ ల లో భాగంగా జడ్జి లు నాగబాబు, రోజా లతో పాటు యాంకర్లు రష్మీ, అనసూయ ల పై కూడా సెటైర్ లు వేస్తుంటారు టీం మెంబెర్స్. ఇక ఈ షో ఇన్స్పిరేషన్ తో వేరే ఛానెల్ లో ‘అదిరింది’ అనే కామెడీ షో ప్రారంభమైంది.

ఈ షో కి యాంకరింగ్ చేస్తున్న అనసూయ… ఓ సిట్ లో భాగంగా ‘ఆమె యాంకరా… లేక పార్టీలో ఉందా’ అంటూ సెటైర్ వేసింది. ఈ క్రమంలో బ్యాక్ గ్రౌండ్ లో బతుకు జట్కా బండి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వేయడంతో ఈ క్లిప్ వైరల్ అయ్యింది. “‘రాజకీయాల్లో బిజీగా ఉన్న రోజా .. అనసూయకు అంత లోకువైపోయిందా’ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus