అనసూయ ఎమోషనల్ కామెంట్స్ వైరల్…!

ఓ న్యూస్ రిపోర్టర్ గా కెరీర్ ను మొదలు పెట్టి తరువాత స్టార్ యాంకర్ గా ఎదిగింది అనసూయ. ప్రస్తుతం సినిమాల్లో తనకు మంచి పేరు తెచ్చి పెట్టే పాత్రలను చేస్తూ ముందుకు సాగుతున్న బ్యూటీకి సోషల్ మీడియాలో మాత్రం ఎక్కువ ట్రోల్స్ ఎదురవుతుంటాయి. దానికి గల కారణం ఏంటి అనే దాని పై తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది అనసూయ. ఆమె మాట్లాడుతూ….. ‘అత్తారింటికి దారేది’ సినిమా టైం నుండీ నా పై ట్రోలింగ్‌ మొదలైంది.నేను అప్పుడు ట్విటర్‌కు కొత్త ఎంట్రీ. ‘ఆ పాటలో నేను లేను. గుంపులో గోవిందంలా లేకపోవడం మంచిది అయింది’ అంటూ నాకు నచ్చినట్టు ఓ ట్వీట్‌ చేశాను. అంతే, ట్రోలింగ్‌ మొదలైంది.

ఒక ఆర్టిస్ట్‌గా కెమెరా ఫోకస్‌ మొత్తం మన పై ఉండాలనుకోవడం తప్పేమీ కాదు కదా!అందులోనూ నేను ఒక్కదాన్ని అయితే ఆ పాటకు ఒప్పుకునే దాన్ని.! కానీ అప్పుడు నేను ఆరునెలల గర్భవతిని.అదే మెయిన్ రీజన్.ఇక ఆ సినిమా రిలీజ్ అయ్యాక ఆ పాట చెయ్యకపోవడమే మంచిది అయ్యింది అనిపించింది. ఇక ట్రోలింగ్‌ విషయానికొస్తే… కొందరు నెటిజన్లకు ‘తెలుగింటి అమ్మాయిలు అంటే లోకువ’ అని ఒకప్పుడు బాధేసేది. ఈ ట్రోలింగ్ వల్ల నేను డిప్రెషన్‌కు వెళ్లేదాన్ని. అయితే నా కుటుంబం నాకు అండగా నిలబడింది.డెలివరీ తర్వాత ఏ మహిళ అయినా, శరీరకంగా, మానసికంగా వీక్‌ అయిపోతారు. కానీ, నా శ్రేయోభిలాషుల వల్ల నేను త్వరగా కోలుకున్నాను.

అయితే కొందరు ఉన్నారు…. నేను ఎలా ఉండాలో వాళ్లే నిర్ణయిస్తారు. ‘నేను నొప్పులు పడి.. నేను కని.. నేను పెంచుకుంటున్నా. కష్టమంతా నాది’. కానీ, వాళ్లు ‘నువ్వు తల్లివి.. అలా ఉండలేవా’ అంటుంటారు. ఇక ఎవరినీ విడిచిపెట్టేది లేదు. అందుకే రెబల్‌గా మారా. ప్రస్తుతం కరోనా వల్ల‌ కొంచెం తగ్గాను. నా దగ్గర ఎంతోమంది పై ఎఫ్‌ఐఆర్‌లు ఉన్నాయి.ఎవ్వరినీ వదిలేది లేదు. ఇలా మోహం కనబడకుండా ట్రోల్స్‌ చేసే వారిని ‘కీబోర్డ్‌ వారియర్స్‌’ అంటాను. ఎదురుగా నిలబడితే ఒక్క మాట కూడా మాట్లాడలేరు. అమ్మవారిని దైవంగా కొలిచే మన దేశంలో ఒక మహిళపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. నా పిల్లలను, నా భర్తను కూడా ఇందులోకి ఇన్వాల్వ్ చేసి బాధ పెడుతుంటారు.” అంటూ ఎమోషనల్ అయ్యింది అనసూయ.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus