అనసూయ.. ఆగ్రహం రెండూ కవలలు అయి ఉంటాయి. ఎందుకంటే అనసూయని ఒక్క చిన్న మాటంటే చాలు ఆగ్రహం తన్నుకు వస్తుంది. చెడా మడా తిట్టేస్తుంది. గతంలో అనేక సార్లు విరుచుకుపడింది. అలాంటి సంఘటనే తాజాగా మరొకటి జరిగింది. రంగస్థలం సినిమా తర్వాత అనసూయ నటిస్తోన్న మూవీ “కథనం”. ఇందులో లీడ్ రోల్ పోషిస్తోంది. విజయదశమి సందర్భంగా ఆ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ లుక్ విశేషంగా ఆకట్టుకుంది. “క్షణం” తర్వాత మళ్ళీ అటువంటి రోల్ పోషించబోతున్నందుకు ఆమెను అందరూ అభినందించారు. అయితే ప్రశంసలతో పాటు.. విమర్శలు వచ్చాయి. “కొన్ని కారణాల వల్ల లేడీ ఓరియెంటెడ్ కూడా ఒక జానర్ గా అయిపోతోంది” అని నెటిజన్ ట్వీట్ చేసాడు. ఇది అనసూయకు ఆగ్రహాన్ని తెప్పించింది.
“ఏదైనా మేల్ యాక్టర్ మెయిన్ రోల్ లో ఉన్న సినిమాను మేల్ ఓరియెంటెడ్ సినిమా అని ఒక్కరు కూడా పిలవరు. అదే గనుక ఒక ఫిమేల్ యాక్టర్ లీడ్ రోల్ చేస్తే అందరూ ఎందుకు ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా అంటారు?” అని ప్రశ్నించింది. “అందరూ యాక్టర్లు చేసే పాత్రలు వేటికవే ప్రత్యేకం.. ప్రతి పాత్ర.. అది మేల్ క్యారెక్టర్ అయినా, ఫిమేల్ అయినా సినిమాలో ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే నా ఉద్దేశంలో ఎవరి సినిమా గురించి అయినా ప్రస్తావించే సమయంలో ‘ఫలానా వారు లీడ్ రోల్ లో నటించిన’ అని అంటే సరిపోతుంది” అని క్లాస్ పీకింది. ఆమె ఆవేదన అర్ధమయింది కానీ తన తోటి యాంకర్ రష్మి “కథనం” ఫస్ట్ లుక్ ను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ “ఉమెన్ సెంట్రిక్ ఫిలిమ్స్ వర్దిల్లాలి” అని ట్వీట్ చేసింది. మరి ఆమె అలా అంటే అనసూయకి కోపం ఎందుకు రాలేదో.. అని నెటిజనులు తిరిగి ప్రశ్నిస్తున్నారు.